NTV Telugu Site icon

వివేక్ రోజుకో పార్టీ మార్చే ఊసరవెల్లి: బాల్క సుమన్

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో వివేక్ కుటుంబం చేసింది ఏమీ లేదని తెలంగాణ ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. వివేక్ రోజుకో పార్టీ మార్చే ఊసరవెల్లి.. దొంగే దొంగ అని అరిచినట్టు వివేక్ విమర్శలు ఉన్నాయన్నారు. దళిత బంధువు పైన వివేక్ తన వైఖరి చెప్పాలి. మీ కార్పొరేట్ రాజకీయాలు చెన్నూర్ గడ్డపైన నడువవు. బడ్జెట్ అనుసరించి త్వరలోనే దళిత బంధు పథకం రాష్ట్రం మొత్తం అమలు చేస్తామన్నారు.

చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధికి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని బాల్క సుమన్ తెలిపారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో 87 కోట్లతో అభివృద్ధి పనులు.. సింగరేణి స్థలాల క్రమబద్దీకరణ కోసం జీవో 76 తీసుకొచ్చాము. తద్వారా మున్సిపాలిటీలో 3941 కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. బీజేపీ నాయకులవి ఆధారం లేని ఆరోపణలు.. గుజరాతీ గులాం బ్రతుకులు బీజేపీ నాయకులవి. మోడీ రాజీనామా చేస్తే దేశం బాగుపడుతది. కేంద్రం తెలంగాణను మోసం చేస్తూ వంచిస్తుంది. దమ్ముంటే బీజేపీ నాయకులు కాళేశ్వరంలో జరిగిన అవినీతిని సాక్షాలతో నిరూపించాలి. చాతనైతే కాళేశ్వరానికి జాతీయ హోదా ఇప్పించండి. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ITIR ప్రాజెక్ట్ ఏమయ్యాయి. ప్రతిపక్షాలు దళితులను ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూశాయి. బీజేపీ ప్రభుత్వంలో గ్యాస్, పెట్రోల్, నిత్యావసర ధరలు రెట్టింపు అయ్యాయి. మోడీ హయాంలో దేశం దివాళా తీసింది. బంగ్లాదేశ్ జీడీపీ కన్నా మన దేశజీడీపీ తక్కువగా ఉంది. దేశాన్ని మోడీ అంబానీ, అదానీలకుకు తాకట్టు పెట్టాడు. 50వేల మెజారిటీతో హుజురాబాద్ లో గెలుస్తామని బాల్క సుమన్ ధీమా వ్యక్తం చేశారు.