ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే ఊరుకోమని టీఆర్‌ఎస్ నేత నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్ తెలిపారు. ఎన్ని కేసులైనా ఎదుర్కొంటానని… ఢిల్లీ నుంచి వచ్చిన ఒత్తిడితో నాపై కేసు నమోదు చేశారని తెలిపారు నంద్ బిలాల్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నాయకులు అనుచిత వాఖ్యలు చేస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. బీజేపీ మతరాజకీయలు చేస్తూ… తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు నంద్ బిలాల్. తనపై ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదని, జాతీయ రాజకీయాలలోకి కేసీఆర్ రావాలని, వారి సేవలు దేశానికి అవసరమన్నారు నంద్ బిలాల్. జాతీయ పార్టీ ప్రకటించనున్న సందర్భంగా… మేం హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా… బేగంబజార్ లో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి కిషోర్ వ్యాస్, టీఆర్‌ఎస్ మహిళా కార్యకర్తలతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల గణేష్ శోభయాత్రలో ప్రసంగిస్తున్న అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మను టీఆర్‌ఎస్ నేత నంద్ బిలాల్ అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై హింత బిశ్వశర్మ చేస్తున్న వ్యాఖ్యలను నంద్ బిలాల్ అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు నంద్ బిలాల్‌ను అక్కడినుండి పంపించేశారు. అయితే ఈ క్రమంలో.. సీఎం హిమంత బిశ్వశర్మ పర్యటనలో భద్రత లోపం దొర్లిందని పోలీసులుపై సైతం బీజేపీ శ్రేణులు విమర్శించారు.
