Site icon NTV Telugu

కేంద్రం ముందు టీఆర్ఎస్ డిమాండ్లు !

టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ హైటెక్స్‌ వేదికగా ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు గులాబీ దళం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలకు ఆరు వేల మంది ప్రతినిధులు హాజరవుతారు. ప్రతినిధుల నమోదు కోసం 35 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి సెషన్‌ జరుగుతుంది. అయితే.. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి టీఆర్‌ఎస్‌ పార్టీ కొన్ని డిమాండ్లు పెట్టింది.
డిమాండ్లు :
కూలల వారిగా బీసీ జనాభా లెక్కలు సేకరించాలి. అసెంబ్లీ చేసిన తీర్మానం పై కేంద్రం నిర్ణయం తీసుకోవడం లేదు..కేంద్రం దిగి వచ్చే వరకు టీఆర్‌ఎస్ పోరాటం చేస్తుంది..
బీసీ లకి కేంద్రం లో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి.
Sc వర్గీకరణ, st మైనారీటి రిజర్వేషన్ల పెంపుదల కోసం చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలి.
సమైఖ్య స్ఫూర్తి నిలబెట్టాలి.
విభజన హామీలు నెరవేర్చాలి.
ఐటీఐఆర్ ,బయ్యారం లో ఉక్కు ప్యాక్టరి,వరంగల్ లో రైల్వే కోచ్ ప్యాక్టరి ఏర్పాటు చేయాలి.
కాళేశ్వరం లేదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్స్ లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలి..

Exit mobile version