NTV Telugu Site icon

Ram Charan: తారక్ ను సైడ్ యాక్టర్ అంటారా.. ఎంత ధైర్యంరా మీకు

Tarak

Tarak

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద ఎప్పుడూ రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ రచ్చ కాస్తా యుద్ధంగా మారింది. మేము మేము బాగానే ఉంటాం.. మీరు కూడా అలాగే ఉండాలి అని కోరుకుంటున్నాం అని ఎంతమంది స్టార్ హీరోలు ఎంతలా చెప్పినా కొంతమంది ఫ్యాన్స్ మాత్రం అస్సలు మారడం లేదు. లేనిపోనివి ఉహించుకొని.. చిన్నవాటిని పెద్దవిగా చేసి ట్విట్టర్ లో మాటల యుద్ధం మొదలుపెట్టేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తం అమెరికాలో సందడి చేస్తున్న విషయం తెల్సిందే. మార్చి 12 న జరగబోయే ఆస్కార్ వేడుకల కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ ఇప్పటికే అమెరికాకు వెళ్లి ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇక ఇందులో రామ్ చరణ్ ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి చెప్పుకొస్తున్నాడు. తారక్ ఈ మధ్యనే వెళ్లి అతడితో జాయిన్ అయ్యాడు. ఇక తాజాగా ఈ ఇంటర్వ్యూలలో చరణ్- తారక్ ఒకరి గురించి ఒకరు అన్న మాటలను తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేసుకొని ఫ్యాన్స్ ను రెచ్చగొడుతున్నారు ఇరు వర్గాల ఫ్యాన్స్.

Krithi Shetty: బేబమ్మ కూడా ట్యాలెంట్ చూపిస్తోంది భయ్యో

తాజాగా టాక్ ఈజీ విత్ సామ్ ఫ్రాగోసో అనే షో లో చరణ్ సందడి చేశాడు. సినిమా గురించి, నాటు నాటు సాంగ్ గురించి ఎన్నో విశేషాలు చెప్పుకొచ్చాడు. ఇక తరువాత ఆ షో యాంకర్ తారక్ గురించి అడుగుతూ ఇంగ్లిష్ లో ఈరోజు నేను మీ ఎలాంగ్ సైడ్ యాక్టర్( along side actor) గురించి చెప్పండి అని అడిగాడు. ఇంగ్లీష్ లో ఎలాంగ్ సైడ్ యాక్టర్ అంటే.. మీతో పాటు నటించిన హీరో అని అర్ధం.. అంటే ఎన్టీఆర్ గురించి చెప్పమని అడిగాడు. ఇక ఈ బైట్ ను చరణ్ ఫ్యాన్స్ ఎడిట్ చేసి సైడ్ యాక్టర్ ఎన్టీఆర్ గురించి చెప్పండి అని అడగగానే చరణ్ తారక్ గురించి చెప్పుకొచ్చాడు. ఇక ఈ బైట్ ను షేర్ చేస్తూ చరణ్.. తారక్ ను సైడ్ యాక్టర్ అన్నాడు అంటూ లేనిపోనివి కల్పించుకొని ట్విట్టర్ లో కొత్త యుద్దానికి తెరలేపారు. దీంతో తారక్ ను సైడ్ యాక్టర్ అంటారా.. ఎంత ధైర్యంరా మీకు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చరణ్ ఫ్యాన్స్ మీదకు దూసుకొచ్చారు. ఇలా ఒకరిపై ఒకరు ట్వీట్ల యుద్ధం మొదలుపెట్టారు. మరి ఈ యుద్ధం ఎక్కడికి వెళ్లి ఆగుతుందో చూడాలి.

Show comments