తెలుగు చిత్ర పరిశ్రమలో ‘మాటల మాంత్రికుడు’గా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్, నేడు అగ్ర దర్శకుల్లో ఒకరు. ఆయన కలం నుంచి వచ్చే ప్రతి మాట ఒక తూటాలా పేలుతుంది. అయితే, ఇంతటి ఘనవిజయం వెనుక ఒక బాధాకరమైన సంఘటన దాగి ఉంది. ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన మూవీ ‘నువ్వు నాకు నచ్చావ్’. 2001లో వెంకటేష్ హీరోగా విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కాగా ఈ సినిమాని జనవరి 1న ఈ సినిమా 4K వెర్షన్‌లో మళ్ళీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న త్రివిక్రమ్ ఈ మూవీ విడుదలైన రోజున జరిగిన ఓ చేదు అనుభవాని పంచుకున్నాడు.
Also Read : Prema : ఒంటరిగానే పోరాడాను..పెళ్లి విడాకులపై నటి షాకింగ్ కామెంట్స్..
త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘ ఈ చిత్రం విడుదలైన రోజే నా సొంత ఊరు భీమవరం వెళ్లాను. అక్కడ థియేటర్ బయట ఒక ప్రేక్షకుడిని సినిమా ఎలా ఉందని అడగ్గా.. “రెండు మూడు వారాలు ఆడుతుందేమో” అని పెదవి విరిచాడట. ఆ మాట విన్నగానే నేను ఇక సినిమాలకు పనికిరానేమో అని భావించి ఇంటికెళ్లి వాళ్ల అమ్మ ఒడిలో తలపెట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్న ..ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బాగుండేది, సినిమాలకు వచ్చి తప్పు చేశాను అనిపించింది. కానీ, నిర్మాత స్రవంతి రవి కిశోర్ ఆయనను వెంటనే హైదరాబాద్ రమ్మని పిలిచి, థియేటర్ వద్ద జనం రద్దీని చూపించారు. టికెట్ల కోసం ఆడియెన్స్ పడుతున్న తపనను చూశాక కానీ నా ప్రాణం లేచి రాలేదు. రూ. 7 కోట్లతో రూపొందిన ఆ చిత్రం రూ. 18 కోట్ల షేర్ వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది. 25 ఏళ్ల తర్వాత కూడా ఈ మ్యాజిక్ తగ్గకపోవడం విశేషం. అందుకే, ఈ చిత్రం నా జీవితానికి చాలా స్పేషల్’ అని తెలిపాడు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
