ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మరో సినిమా రాబోతుంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పడు నాలుగో సినిమాకు సిద్ధమవుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈసారి వీరి కాంబినేషన్‌లో రాబోయేది ఒక భారీ మైథలాజికల్ చిత్రం కావడం విశేషం.
ఈ సినిమా లార్డ్ కార్తికేయ (సుబ్రహ్మణ్య స్వామి) నేపథ్యంలో తెరకెక్కనుంది. GodOfWar పేరుతో రాబోతున్నఈ సినిమా భారీ విజువల్స్, గ్రాండ్ సెట్స్, గ్లోబల్ స్టాండర్డ్స్‌తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుండగా, దాని బడ్జెట్ రూ.1000 కోట్లకు పైగా ఉంటుందని ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. త్రివిక్రమ్ మార్క్ షార్ప్ డైలాగ్స్, మైథలాజికల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను ప్రపంచ స్థాయి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించనున్నారని సమాచారం.
Also Read : TheRajaSaab : రాజాసాబ్ సెన్సార్ ఫినిష్.. ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న రన్ టైమ్
అయితే ఈ సినిమాను అల్లు అర్జున్ తో కాదని జూనియర్ ఎన్టీఆర్ చేయబోతున్నాడని గత కొంత కాలంగా వార్తలు హల్ చల్ చేసాయి. ఎన్టీఆర్ కూడా అప్పట్లో సుబ్రమణ్య స్వామి పుస్తకం పట్టుకుని కనిపించి ఫ్యాన్స్ లో ఆశలు పెంచాడు. ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఎన్టీఆర్ చేస్తే బాగుంతుందని ఆశించారు. కానీ వారి నమ్మకాన్ని ఎన్టీఆర్ బ్రేక్ చేసేసాడు. అనేక చర్చల అనంతరం ఈ కథ మళ్లీ అల్లు అర్జున్ కాంపౌండ్ లోకి వచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో చేస్తున్న భారీ యాక్షన్ ప్రాజెక్ట్ AA22 పూర్తి అయిన తర్వాతే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం 2027 ఫిబ్రవరి లేదా మార్చిలో షూటింగ్ ప్రారంభం కానుంది.
