NTV Telugu Site icon

Trisha : విజయ్ లో ఆ ఒక్క విషయం నాకు నచ్చదు..

Whatsapp Image 2024 05 05 At 11.37.01 Am

Whatsapp Image 2024 05 05 At 11.37.01 Am

స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గత రెండు దశాబ్దాలుగా త్రిష తెలుగు,తమిళ భాషలలో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది.పొన్నియన్ సెల్వన్ మూవీతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష.. ఆతరువాత దళపతి విజయ్ సరసన లియో సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఆ సినిమాతో మరో సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. లియో సినిమాతో దాదాపు 15 ఏళ్ల తర్వాత త్రిష మళ్లీ విజయ్ సరసన నటించింది.

త్రిష తాజాగా తన 41వ పుట్టినరోజు జరుపుకుంది. అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు బర్త్డే విషెస్ తెలిపారు.ఇదిల ఉంటే త్రిష పాత ఇంటర్వ్యూ ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. విజయ్ మరియు త్రిష గతంలో ఓ లైవ్ షోకు హాజరవ్వగా.. అందులో త్రిష చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.విజయ్ గురించి ఆసక్తికరమైన విషయం చెప్పమని త్రిషను అడుగగా ఆమె స్పందిస్తూ, షూటింగ్ స్పాట్‌లో అందరూ ఎంతో సరదాగా గడిపే సమయంలో విజయ్ మాత్రం పక్కకు వెళ్లి ఓ మూలన కూర్చుని గంటల తరబడి ఓ గోడవైపు చూస్తూ ఉండేవారు. అతను సెట్‌లో ఎప్పుడూ సైలెంట్ గా ఉంటాడు..ఎవరితో కూడా అంతగా మాట్లాడడు..విజయ్ లో నాకు నచ్చని విషయం అదొక్కటే అని త్రిష తెలిపింది .