NTV Telugu Site icon

Trisha Krishnan: ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు: త్రిష

ఇటీవలి రోజుల్లో త్రిష కృష్ణన్‌ను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆ మధ్య త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లియో సినిమాలో త్రిషతో రేప్ సీన్ లేనందుకు బాధపడ్డానంటూ మన్సూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పలువురు సెలబ్రిటీలు మన్సూర్‌పై మండిపడ్డారు. అతడిని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. త్రిష చట్టపరంగా వెళ్లడంతో ఆమెకు మన్సూర్ క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం సద్దుమణిగింది.

తాజాగా త్రిషపై అన్నాడీఎంకే లీడర్ ఏవీ రాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. త్రిషకు ఓ ప్రముఖ పొలిటికల్ లీడర్ డబ్బులిచ్చి రిసార్ట్‌కి తీసుకెళ్లాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీన్నిత్రిష తీవ్రంగా ఖండించారు. త్రిష అతడికి నోటీసులు పంపారు. ఈ వ్యవహారంలో హీరో విశాల్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు త్రిషకు అండగా నిలిచారు. ముఖ్యంగా దర్శకుడు చేరన్‌, సముద్రఖని, నాజర్‌ ఆమెపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తనకు మద్దతుగా నిలిచిన ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు అంటూ త్రిష పేర్కొన్నారు.

Also Read: Drugs Case: రూ. 2,000 కోట్ల డ్రగ్స్ రాకెట్‌.. మాస్టర్‌మైండ్‌ సినీ నిర్మాత!

ఆ మధ్య వరుస ఫ్లాప్‌లతో వెనకపడిపోయిన త్రిష.. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంతో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించారు. ఆ తరువాత లియో చిత్రంలో విజయ్‌తో నటించి మంచి హిట్‌ను అందుకున్నారు. ప్రస్తుతం అజిత్‌ సరసన ‘విడాముయర్చి’, కమల్‌హాసన్‌కు జోడిగా ‘థగ్స్‌ లైఫ్‌’ సినిమాల్లో నటిస్తున్నారు. ఇక అనిల్‌ రావిపూడి, వెంకటేష్‌ కాంబోలో రానున్న సినిమాలో త్రిషను హీరోయిన్‌గా ఖరారు చేశారని తెలుస్తోంది.

Show comments