Tripura minister Died : సీనియర్ మంత్రి, బిజెపి మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపిఎఫ్‌టి) అధ్యక్షుడు నరేంద్ర చంద్ర డెబ్బర్మ దీర్ఘకాలిక అనారోగ్యంతో ఆదివారం మరణించినట్లు కుటుంబ మరియు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అతడి వయసు 80 ఏళ్లు. ఆయనకు గత శుక్రవారం తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబసభ్యులు.. అగర్తలాలోని గోవింద్ వల్లభ్ పంత్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. మూడు రోజులుగా ఆ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న దెబ్బర్మ ఇవాళ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. గిరిజన నాయకుడైన దెబ్బర్మ (ఐపిఎఫ్‌టి)ని స్థాపించి విజయవంతంగా నడిపించారు. 2018లో బిజెపి-ఐపిఎఫ్‌టి కూటమి ప్రభుత్వాన్ని స్థాపించడంలో కూడా దెబ్బర్మ కీలకపాత్ర పోషించారు. సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ కూటమిని ఓడించారు. కాగా, డెబ్బర్మకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, భార్య ఉన్నారు.
Read Also: Fund For Orphans: హిమాచల్ ప్రదేశ్ సీఎం న్యూ ఇయర్ గిఫ్ట్.. అనాథలకు ప్రత్యేక నిధి
‘రాష్ట్ర కేబినెట్ సీనియర్ సభ్యులు ఎన్.సీ.దేవవర్మ మృతి చెందడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని కోరుకుంటున్నా. ఓం శాంతి!’ అని ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మానిక్ సాహా. మరోవైపు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి సంతాపం ప్రకటించారు రాజ్యసభ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్.