యానిమల్ మూవీ తో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా యంగ్ హీరోయిన్ తృప్తి దిమ్రి ఎంతో పాపులర్ అయింది.ఒక్క సినిమాతో తృప్తి విపరీతంగా ఎంతో ఫేమస్ అయ్యారు.. ‘యానిమల్’లో రణబీర్ కపూర్, తృప్తి దిమ్రి మధ్య సన్నివేశాలు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. యానిమల్ ఇచ్చిన జోష్ లో తృప్తికి వరుస క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.. తాజాగా కార్తీక్ ఆర్యన్ సరసన ‘భూల్ భులాయ్యా’లో నటించే అవకాశాన్ని ఆమె సొంతం చేసుకున్నారు.సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా… జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘చంద్రముఖి’ తమిళ, తెలుగు భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా ‘భూల్ భులయ్యా’ పేరుతో రీమేక్ చేశారు. అంతే కాదు… కార్తీక్ ఆర్యన్ హీరోగా ‘ భూల్ భులయ్యా 2’ పేరుతో ఆ సినిమాకు సీక్వెల్ కూడా వచ్చింది..
ఇప్పుడు ‘భూల్ భులయ్యా 3’ తెరకెక్కిస్తున్నారు. అందులో తృప్తి దిమ్రి నటిస్తున్నట్లు ఇవాళ అనౌన్స్ చేశారు.’వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ భూల్ భులయ్యా” అంటూ తృప్తి దిమ్రికి స్వాగతం పలికారు హీరో కార్తీక్ ఆర్యన్. ”ఆమె చిరునవ్వు ఎంతో మంది గుండెల్లో భయం కలిగిస్తుంది. తృప్తి రాకతో థ్రిల్స్, చిల్స్ మరింత పెరుగుతాయి” అని టీ సిరీస్ పేర్కొంది. ‘భూల్ భులయ్యా 3’ చిత్రానికి అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాను టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘యానిమల్’ సినిమా నిర్మాతలలో ఆయన కూడా ఒకరిగా వున్నారు.అక్షయ్ కుమార్ ‘భూల్ భులయ్యా’ సినిమాలో విద్యా బాలన్ నటించారు. తెలుగులో జ్యోతిక చేసిన పాత్రను ఆమె పోషించారు. అయితే, సీక్వెల్ ఆమె చేయలేదు. కార్తీక్ ఆర్యన్ ‘భూల్ భులయ్యా 2’లో టబు నటించారు. అందులో కియారా అడ్వాణీ హీరోయిన్. అయితే.. ఇప్పుడు మూడో పార్ట్ ‘భూల్ భులయ్యా 3’కు వచ్చేసరికి మళ్లీ విద్యా బాలన్ ను తీసుకున్నారు. దీపావళికి ఈ సినిమా విడుదల కానుంది