NTV Telugu Site icon

Hair in Flight Meal: ఫ్లైట్ భోజనంలో వెంట్రుకలు.. ఎయిర్‌లైన్స్‌కు ఫిర్యాదు చేసిన ఎంపీ

Hair In Meal

Hair In Meal

Hair in Flight Meal: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమీ చక్రవర్తి మంగళవారం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌పై విరుచుకుపడ్డారు. రాజకీయ నాయకురాలు మిమీ చక్రవర్తి ఫ్లైట్‌లో తనకు వడ్డించిన భోజనంలో వెంట్రుకలు ఉన్నాయని ఫిర్యాదు చేసింది. ఆ భోజనం చిత్రాలను కూడా ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఎయిర్‌లైన్స్ ప్రతినిధులకు మెయిల్‌ చేసినప్పటికీ ఎటువంటి స్పందన, క్షమాపణలు రాలేదని ఆమె తెలిపింది. ఈ మేరకు ఆమె ట్విటర్‌ వేదికగా తెలిపింది.

Read Also: Education Ministry Rule: ఒకటో తరగతిలో చేర్చుకునే చిన్నారులకు ఆరేళ్లు ఉండాల్సిందే.. కేంద్రం కొత్త రూల్!

సంబంధిత విమాన సర్వీసు ప్రతినిధులకు తాను ఇప్పటికే అన్ని వివరాలను మెయిల్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో.. మీరు శ్రద్ధ వహిస్తే అన్ని వివరాలతో నా మెయిల్‌ను కనుగొనవచ్చని రాసింది. ఆమె ట్వీట్ వైరల్ అయిన తర్వాత, ఎమిరేట్స్ సపోర్ట్ ఆమె ఫిర్యాదుపై స్పందించింది, సంఘటనకు క్షమాపణలు చెప్పింది. అభిప్రాయాన్ని రాయమని అభ్యర్థించింది. తమ కస్టమర్‌ రిలేషన్స్ టీమ్ ఈ విషయాన్ని సమీక్షిస్తుందని వెల్లడించింది. మిమీ చక్రవర్తి పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. ఆమె పలు బెంగాలీ సినిమాల్లో నటించింది. ఆమె చివరిగా అరిందమ్ సిల్ దర్శకత్వంలో వచ్చిన థ్రిల్లర్ చిత్రం ‘ఖేలా జాఖోన్’లో కనిపించింది.