Site icon NTV Telugu

Australia Squad: భారత్ టీ20 సిరీస్ నుంచి ట్రవిస్‌ హెడ్‌ ఔట్.. కారణం అదేనా?

Travis Head Out

Travis Head Out

గోల్డ్‌కోస్ట్‌ వేదికగా నవంబర్‌ 6న ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ ఓపెనర్ ట్రవిస్‌ హెడ్‌ను ఆసీస్ జట్టు నుంచి రిలీజ్ చేశారు. 2025 షెఫీల్డ్ షీల్డ్‌లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడాలని సీఏ ఆదేశించింది. రొటేషన్‌లో భాగంగా చివరి రెండు టీ20లకు విశ్రాంతిని ఇచ్చారు. అంతేకాదు 2025 యాషెస్‌ సిరీస్‌ వ్యూహాల్లో భాగంగా సీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారత్ టీ20 సిరీస్‌లో సీనియర్లకు సీఏ అవకాశం ఇవ్వలేదు. స్టీవ్ స్మిత్‌, మిచెల్ స్టార్క్‌, జోష్ హాజిల్‌వుడ్‌, కెమరూన్ గ్రీన్ ప్రస్తుత టీ20 సిరీస్‌లో ఆడడం లేదు. వీరందరూ షెఫీల్డ్‌ షీల్డ్‌లో ఆడనున్నారు. టీ20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లు ఆడిన ట్రవిస్‌ హెడ్‌.. వరుసగా 8, 28, 29 పరుగులు చేశాడు. హెడ్‌ స్థానాన్ని ఏ ప్లేయర్ భర్తీ చేస్తారో చూడాలి. ఇక టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా, భారత్ 1-1 సమంగా ఉన్నాయి. దాంతో నాలుగో మ్యాచ్ కీలకంగా మారనుంది.

ఆస్ట్రేలియా టీమ్:
మిచెల్‌ మార్ష్‌, మిచెల్‌ ఓవెన్‌, మాథ్యూ షార్ట్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, జోష్‌ ఇంగ్లిస్‌, జోష్‌ ఫిలిప్‌, మార్కస్‌ స్టోయినిస్‌, మహ్లి బియర్డ్‌మన్‌, టిమ్‌ డేవిడ్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌, నాథన్‌ ఇల్లిస్‌, బెన్‌ డ్వార్షుయిస్‌, మాథ్యూ కుహ్నేమన్‌, ఆడమ్‌ జంపా, జేవియర్‌ బార్ట్‌లెట్‌.

 

Exit mobile version