NTV Telugu Site icon

World Cup 2023: ఆస్ట్రేలియాకు గుడ్ న్యూస్‌.. నెదర్లాండ్స్‌ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ ఎంట్రీ!

Australia Team Cwc 2023

Australia Team Cwc 2023

Travis Head set to join Australia World Cup Squad: భారత్ గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌ 2023లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన ఫైవ్‌ టైమ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. నేడు లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి మెగా టోర్నీలో బోణీ చేయాలనీ చూస్తోంది. ఇక పాకిస్తాన్‌తో జరుగబోయే తదుపరి మ్యాచ్‌ (అక్టోబర్‌ 20)కు ముందు స్టార్ ప్లేయర్ ట్రవిస్‌ హెడ్‌ భారత గడ్డపైకి రానున్నాడట.

ప్రపంచకప్‌ 2023కి ముందు దక్షిణాఫ్రికా టూర్‌ సందర్భంగా ట్రవిస్‌ హెడ్‌ ఎడమ చేతికి ఫ్రాక్చర్‌ అయింది. అయినా కూడా మెగా టోర్నీ కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో హెడ్‌కు చోటు దక్కింది. గాయం నుంచి త్వరగా కోలుకుంటే.. హెడ్‌ సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) అతనికి రీప్లేస్‌మెంట్‌గా ఎవరిని ఎంపిక చేయలేదు. సీఏ ఆశించిన విధంగానే హెడ్‌ కోలుకున్నాడట. ప్రస్తుతం అతడు ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాడని తెలుస్తుంది. కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియాను ఆదుకునేందుకు భారత్‌కు త్వరలోనే బయల్దేరనున్నాడట.

Also Read: Chandrababu Naidu Arrest: ప్రపంచకప్‌ 2023 మ్యాచ్‌.. నారా చంద్రబాబుకు మద్దతు!

ట్రవిస్‌ హెడ్‌ గురువారం భారత్‌కు పయనమవుతాడని సమాచారం. పాకిస్తాన్‌ మ్యాచ్‌కు ముందే హెడ్‌ భారత్ వచ్చేసినా.. అక్టోబర్‌ 25న నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌ నుంచి జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు. ఈ విషయంపై సీఏ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రపంచకప్‌ 2023కలో భారత్‌, దక్షిణాఫ్రికా చేతుల్లో ఆసీస్ ఓటమిపాలైంది. టీమిండియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిన ఆసీస్‌.. ప్రొటీస్ చేతిలో 134 పరుగుల భారీ తేడాతో ఓడింది. దాంతో మైనస్ రన్ రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.

 

Show comments