ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తారు. మొదట వారితో హై ప్రొఫైల్ వ్యక్తిగా పరిచయమవుతారు. రోజు రోజు చాటింగ్‌లు చేస్తూ.. వారిలో లేని ఆశలు రెచ్చగొట్టి ఆ ఆశలను క్యాష్ చేసుకుంటున్నారు. అయితే అలాంటి ఓ ఇద్దరి ఆట కట్టించారు సీసీఎస్ పోలీసులు. సీసీఎస్ జాయింట్ కమిషనర్ గజరావు భూపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్,ఫేస్ బుక్ లో ఫేక్ అకౌంట్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్ నైజీరియన్స్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ నైజీరియన్స్ నకిలీ ఖాతా ద్వారా ఒంటరి మహిళలకు వల చేసి మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బేగంపేట చెందిన ఒక యువతి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసామని తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆస్కార్ లియోన్ అనే వ్యక్తి నుంచి వచ్చిన ఫాలోను యాక్సెప్ట్ చేసింది భాదితురాలు.
Also Read : Prabhas: అభిమానులకు గుడ్ న్యూస్.. డ్యూయల్ రోల్లో ప్రభాస్
అయితే.. యూఎస్‌ఏలో డాక్టర్ గా పని చేస్తున్న అని భాదితురాలిని నమ్మించిన నిందితులు.. ఫ్రెండ్ షిప్ కి గుర్తుగా గోల్డ్, ఎలక్ట్రానిక్ వస్తువులను పార్శిల్ పంపిస్తున్నాను అని భాదితురాలిని నమ్మించారు. అయితే.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ టాక్స్ అధికారులకు డబ్బులు కట్టాలని 2.2 లక్షల రూపాయలు కట్టించుకున్నారు. ఆ తరువాత.. ఫోన్‌కు రెస్పాండ్‌కు కాకపోవడంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. అయితే.. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను ఢిల్లీ లో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల పేర్లు.. అలౌట్ పీటర్, రొమాన్స్ జాషువు అని పోలీసులు వెల్లడించారు.