NTV Telugu Site icon

Pramod Muthalik: ముస్లిం అమ్మాయిలను ట్రాప్ చేయండి.. జాబ్, భద్రత కల్పిస్తా

Pramod Mutalik

Pramod Mutalik

Pramod Muthalik: లవ్ జిహాద్‌ను ఎదుర్కోవడానికి ముస్లిం యువతులను ట్రాప్ చేయాలని శ్రీరామ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ హిందూ యువకులను కోరారు. శ్రీరామ సేన నుంచి యువతకు రక్షణ కల్పిస్తామని ముతాలిక్ హామీ ఇచ్చారు. ప్రేమ పేరుతో వేలాది మంది హిందూ యువతులను మోసం చేశారని ఆరోపించారు. కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో జరిగిన బహిరంగ కార్యక్రమంలో ముతాలిక్ మాట్లాడుతూ, “ హిందూ యువతను నేను ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. మనం ఒక హిందూ యువతిని నష్టపోతే.. కనీసం 10 మంది ముస్లిం అమ్మాయిలను ఆకర్షించాలి. అలా చేస్తే శ్రీరామ్ సేన మీ రక్షణ బాధ్యతను తీసుకుంటుంది. ఉపాధి కల్పిస్తుంది. లవ్ జిహాద్ తో మన అమ్మాయిలు దోపిడీకి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా వేలాది మంది బాలికలు ప్రేమ పేరుతో మోసపోతున్నారు. మన చర్యలతో వారిని హెచ్చరించాలి”అని ఆయన సూచించారు.

Read Also: ChatGPT : మోదీ, మస్క్‎ల గురించి సంచలన విషయాలు చెప్పిన చాట్ జీపీటీ

ఉడిపిలోని కర్కల సెగ్మెంట్ నుండి రాబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు ముతాలిక్. తనపై ఇప్పటివరకు 109 కేసులు నమోదయ్యాయని, వాటిలో ఎక్కువ భాగం బీజేపీ హయాంలోనే ఉన్నాయని చెప్పారు. హిందుత్వ విషయంలో సొంత వారి నుంచే తాను సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఆర్థిక సాయం అందించిన కొందరు బీజేపీ నేతల మద్దతు తనకు ఉందని ముతాలిక్ తెలిపారు. ఎన్నికల్లో పోరాడాలన్న తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని కూడా ఆయన తేల్చి చెప్పారు. రాజకీయాలు ఎలా ఆడాలో తనకు తెలియకపోయినా, తన అభిప్రాయాలు ఎప్పుడూ స్పష్టంగానే ఉన్నాయని శ్రీరామ సేన అధినేత అన్నారు.
Read Also: DJ: డీజే పెడతావా.. నీ పెళ్లి, నేను చేయను పో

బీజేపీ బూటకపు హిందుత్వకు నేను మద్దతిచ్చి ఉంటే ఈపాటికి ఎన్నో విజయాలు సాధించి ఉండేవాడినన్నారు. కర్కల స్థానంలో తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తనకు వివిధ వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. రాష్ట్రంలో అవినీతికి వ్యతిరేకంగా, నిజమైన హిందుత్వం కోసం శ్రీరామ సేన పోరాడుతోందని ముతాలిక్ అన్నారు. ప్రస్తుత కర్కల ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని, ఎమ్మెల్యే కూడబెట్టిన ఆస్తులను లెక్కిస్తే నియోజకవర్గంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో తేలిపోతుందని ఆరోపించారు. కన్నడ, సాంస్కృతిక శాఖ రాష్ట్ర మంత్రి వి సునీల్ కుమార్ ప్రస్తుతం కర్కల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.