Site icon NTV Telugu

Transgender In Court: కోర్టులో ట్రాన్స్‌జెండర్ వీరంగం.. బట్టలు చించుకొని రచ్చ రచ్చ!

Transgender In Court

Transgender In Court

Transgender In Court: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని వజీర్‌గంజ్ ADJ కోర్టు ప్రాంగణంలో ఓ ట్రాన్స్‌జెండర్ చేసిన హంగామా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రాన్స్‌జెండర్ హంగామా నేరుగా కోర్టు లోపలనే చోటుచేసుకోవడం విశేషం. ఈ ఘటనలో సదరు ట్రాన్స్‌జెండర్ పోలీసులపై అనుచితంగా ప్రవర్తించి, ఓ పోలీసును కిందకు తోసేయడానికి ప్రయత్నించింది. అంతేకాదు ట్రాన్స్‌జెండర్ కోర్టులోనే బట్టలు విప్పే ప్రయత్నం చేసిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి.

ఈ వైరల్ వీడియోలో, ట్రాన్స్‌జెండర్ కోర్టులో పోలీసులపై కోపంగా రెచ్చిపోయినట్లు కనిపిస్తుంది. కోపంతో గట్టిగా అరుస్తూ.. తన బట్టలు విప్పే ప్రయత్నం చేసి పోలీసులతో వాదనకు దిగింది. అయితే ఆ ఘటన సమయంలో జడ్జి చైర్ వద్ద ఎవరూ లేకపోవడం వీడియోలో గమనించవచ్చు. కానీ, కోర్టులో ఇతర న్యాయ అధికారులు, లాయర్లు, కోర్టు సిబ్బంది ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ట్రాన్స్‌జెండర్ కోర్టులోనే బట్టలు చించుకొని జడుగే కూర్చొనే పోడియం ముందరే బైఠాయించి గట్టిగా అరవడం మొదలు పెట్టింది.

Rohit Sharma: ఐదవ టెస్ట్‌కు రోహిత్ శర్మ.. వీడియో వైరల్!

ఇక ఈ ఘటనపై వజీర్‌గంజ్ పోలీసులు స్పందిస్తూ.. సదరు వీడియో ఇప్పుడిది కాదని, దాదాపు రెండు నెలల క్రితం జరిగిన సంఘటన అని వెల్లడించారు. అప్పట్లో సదరు ట్రాన్స్‌జెండర్ కు నోటీసు ఇచ్చి హెచ్చరించామని తెలిపారు. ఆ ట్రాన్స్‌జెండర్ ఓ కేసుకు సంబంధించి విచారణ సందర్భంగా కోర్టుకు వచ్చిందని పేర్కొన్నారు. ఇకపోతే ఈ విడో చుసిన నెటిజన్స్ ట్రాన్స్‌జెండర్ తీరుపై మండిపడుతున్నారు.

ట్రాన్స్‌జెండర్స్ వివిధ సందర్భాల్లో హంగామాలు చేయడం కనిపించినా.. కోర్టులో ఇలా నేరుగా పోలీసులతో తోపులాటకు దిగడం, అసభ్యంగా ప్రవర్తించడంఎక్కడ చూడలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఈ మధ్య కాలంలో వీరి ఆగడాలు శృతిమించాయని కామెంట్స్ చేస్తున్నారు.

Coolie Trailer : రజినీకాంత్ కూలీ ట్రైలర్ వచ్చేసింది

Exit mobile version