Transgender Heroine: హీరోయిన్ గా ట్రాన్స్జెండర్.. హీరో ఎవరంటే?
ఈరోజుల్లో జనాలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు.. అందుకే సినీ దర్శక, నిర్మాతలు కూడా కొత్తగా చూపించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. సినిమా లో ఏదైనా కొత్తదనం ఉందనిపిస్తే తప్ప పెద్ద స్టార్ హీరో సినిమా అయినా కానీ దాని వైపు చూడటం లేదు.. ఈ మధ్య వస్తున్న సినిమాలకు భిన్నంగా ఓ సినిమా ను తెరకేక్కిస్తున్నారు.. ఆ సినిమా గురించి తెలిసి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తే.. మరి కొందరు మాత్రం ఇలాంటి సినిమా అవసరమా అంటున్నారు.. ఆ సినిమా గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం…
ఎవరు ఊహించని విధంగా ఒక సినిమాలో ట్రాన్సజెండర్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇది ఎక్కడో కాదు కన్నడ పరిశ్రమలో జరిగిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఆ సినిమా పేరు మిస్టర్ అండ్ మిసెస్ మన్మథ.. ఈ సినిమా కోసం ఏకంగా ఆరుగురు హీరోయిన్స్ ను సెలెక్ట్ చేశారు. అందులో వైశాలి అనే ట్రాన్సజెండర్ కూడా ఒకరు. దీనితో సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న తొలి ట్రాన్సజెండర్ గా గుర్తింపు తెచ్చుకుంది.. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు.. ఆ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని చిత్ర యూనిట్ చెబుతున్నారు..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ట్రైలర్ లాంచ్ కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వైశాలి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ” మాకు ఒక జీవితం అనేది ఉంటుంది.. అసలు మేము ఎందుకు అడుక్కోవాలి. అందరి లాగానే మాకు సినిమాల్లో హీరోయిన్ గా నటించాలని కలలు ఉన్నాయి. దాని కోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. అందుకు తగ్గట్లే మిస్టర్ అండ్ మిసెస్ మన్మధ సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చిందని చెప్పింది ఆమె.. ఇక బస్సు లో మా పక్కన కూర్చోవడానికి కూడా అనేక మంది ఆలోచిస్తారు. అలాంటి పరిస్థితులు మారాలి. ఇక నా విషయానికి వస్తే నేను గోవా లోని ఓ క్లబ్ లో డాన్సర్ గా పనిచేసే దానిని. అక్కడ చేస్తూ సినిమాల్లో అవకాశాలు కోసం ట్రై చేశాను. మిస్టర్ అండ్ మిసెస్ మన్మధ సినిమాలో అవకాశం రావడంతో ఉద్యోగం వదిలేసి ఇక్కడకు వచ్చాను.. ఈ సినిమా వచ్చే నెల 6న విడుదల కానుందని మా సినిమాను ఆదరించాలని కోరింది..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో