హర్యానాలోని నుహ్‌లో జరిగిన హింసాకాండ తర్వాత ఖట్టర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నుహ్ లో పలువురు అధికారులను బదిలీ చేసింది. నుహ్ లో జరిగిన వైఫలం తర్వాత.. నుహ్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ పవార్ బదిలీ అయ్యారు. అతని స్థానంలో ధీరేంద్ర ఖర్గతా కొత్త డిప్యూటీ కమిషనర్‌గా నియమితులయ్యారు. అంతేకాకుండా నుహ్ ఎస్పీ వరుణ్ సింగ్లా కూడా బదిలీ అయ్యారు. అతన్ని భివానీకి పంపించగా.. భివానీ ఎస్పీ నరేంద్ర బిజార్నియా నుహ్ ఎస్పీగా నియమితులయ్యారు. ఇటీవలే నుహ్‌లో అల్లర్లు చెలరేగిన సందర్భంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నుహ్ లో శాంతిభద్రతల పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
NC 23: వైజాగులో బోటెక్కి సముద్రంలో డ్రైవింగ్ నేర్చుకున్న నాగ చైతన్య
మరోవైపు హింసాకాండ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటి వరకు 202 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు హర్యానా మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 102 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. హింసాకాండ ఘటనలో పాల్గొన్న వారిలో 19 మంది నిందితులను పోలీసులు నిన్న (గురువారం) కోర్టులో హాజరుపరచి.. వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మిగిలిన నిందితులు పోలీసుల రిమాండ్‌లో ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియా ద్వారా హింసను వ్యాప్తి చేసిన నిందితుల కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారు.
Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు మొదటి ముద్దాయి..! కేసు నమోదు చేయాలి
నుహ్‌లో వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ చేపట్టిన మతపరమైన ఊరేగింపులో అల్లర్లు చెలరేగడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ ఘటన గురుగ్రామ్, సోహ్నా సహా ఇతర ప్రాంతాల్లో మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించింది. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ నిషేధిత ఉత్తర్వులు కొనసాగుతున్నాయి.
