Cyber Fraud: సైబర్ మోసాలకు పాల్పడి కోట్లాది రూపాయలను ఆరు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసిన ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా సైబర్ నేరాల ద్వారా కాజేసిన కోట్లాది రూపాయలను హైదరాబాద్ లోని బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసిన కేసులో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) పోలీసులు రంగంలోకి దిగింది. హైదరాబాద్‌లోని షంషీర్‌గంజ్‌లోని SBI బ్రాంచ్‌లోని 6 కరెంట్ ఖాతాల్లోకి సైబర్ డబ్బును బదిలీ చేయడంపై దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమమంలో ఆరుగురికి ఒకే బ్యాంకు ఖాతాకు రూ.124.25 కోట్లు బదిలీ అయినట్లు గుర్తించారు. ఈ ఖాతాలో మార్చి, ఏప్రిల్ నెలల్లో ‘ప్రూవెన్ ఏహెచ్‌ఎం ఫ్యూజన్’ పేరిట డబ్బు జమ అయింది. అది మహమ్మద్ బిన్ అహ్మద్ బవజీర్ అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు తేలింది. అతడి పేరిట మరో ఖాతాలో రూ.34.19 లక్షలు చేరినట్లు తేలడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.
Read also: CM Revanth Reddy: విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్.. చారిత్రక కట్టడాలు ఉచితంగా సందర్శించే అవకాశం..
ఈ క్రమంలోనే అతడొక కమీషన్ కోసం బ్యాంకు అకౌంట్‌ను సమకూర్చడం అని తేలింది. దుబాయ్‌కి చెందిన సూత్రధారి సూచనల మేరకే తాము బ్యాంకు ఖాతాలు తెరిచామని బవజీర్ వెల్లడించడంతో పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిన నగదును హవాలా మార్గంలో, విదేశీ మారకం ద్వారా విదేశాలకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు మిగిలిన 5 ఖాతాలు ముల్వే అని పోలీసుల విచారణలో తేలింది. ఈ ప్రక్రియలో సూత్రధారి దొరికితేనే కేసు దర్యాప్తు వేగవంతం అయ్యే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఖాతాలో చేరిన రూ.124.25 కోట్ల మొత్తం 234 నేరాలకు సంబంధించినదని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ క్రమంలో రెండు నెలల్లోనే 6 కరెంట్ ఖాతాల్లో సుమారు రూ.150 కోట్ల లావాదేవీలు జరగడంతో పోలీసులు మరింత లోతుగా ఆరా తీశారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.
Naini Rajender Reddy: వాడు వీడు అనడం మంచి పద్దతి కాదు.. కేటీఆర్ పై నాయిని ఫైర్