NTV Telugu Site icon

Viral Video: ఇది నిజంగానే ఘోస్ట్ రైలా? ఇంజిన్ లేకుండా వెళ్లిన ట్రైన్

Train

Train

Train Moved without Engine: రైలు కదలాలంటే కచ్ఛితంగా ఇంజిన్ కావాల్సిందే. డ్రైవర్ ఉండాల్సిందే. అయితే ఓ రైలు మాత్రం ఇవేవి లేకుండానే దానంతట అదే కదిలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.జార్ఖండ్‌ సాహిబ్‌గంజ్ జిల్లాలోని మాల్దా రైల్వే డివిజన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. దీనిని చూసిన జనం ఆశ్చర్యపోయి దీనిని తమ ఫోన్ లో బంధించారు.

అసలేం జరిగిందండటే బార్హర్వా రైల్వే స్టేషన్‌ సమీపంలో ఒక రైల్వే వ్యాగన్‌, నాలుగు బోగీలు ఉన్నాయి. సాధారణంగా అక్కడ గూడ్స్‌ రైళ్లు సరుకులు లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేస్తూ ఉంటారు. అయితే అక్కడ ఇంజిన్ లేకుండా ఉన్న ఆ బోగోలు ఒక్కసారిగా కదిలాయి. రైలు ఏదో వెనకుకు పరిగెడుతున్నట్లు వేగంగా కదిలాయి. బార్హర్వా రైల్వే స్టేషన్‌ చేరుకున్న తరువాత అవి కదలడం ఆగిపోయాయి.

Also Read: Viral Video: అతి తెలివి చూపిన ఆటో డ్రైవర్.. తిక్క కుదిర్చిన పోలీసులు

ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యంతో దాని వెనుక పరుగులు పెట్టారు. అధికారులు కూడా దీనిని చూసి షాక్ అయ్యారు. ఆ విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లారు. రైలు బోగోలు వాటంతటకవే ఎలా కదిలాయి అనే దానిపై దర్యాప్తు చేపట్టారు. అసలు అంత దూరం అవి ఎలా కదిలాయి అసలు ఏం జరిగి ఉంటుంది అనే కోణంలో విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగకపోవడం ఆనందించాల్సిన విషయం. ఇదిలా వుండగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఆ సమయంలో ఎదురుగా మరో ట్రైన్ రాలేదు కాబట్టి సరిపోయిందని కామెంట్ చేస్తున్నారు. ఇంకొంత మంది దీనిపై ఫన్నీగా స్పందిస్తున్నారు. నిజంగానే ఇది ఆత్మ నిర్భర్ ట్రైన్ అని, ఘోస్ట్ రైలు అంటే ఇదేనేమో అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇకనైనా ఇలాంటివి జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అసలు ఇది ఎందకు జరిగిందో తెలుసుకోవాలని కోరుతున్నారు.