NTV Telugu Site icon

Fire Accident: ఎక్స్‌ప్రెస్‌ రైలులో భారీగా చెలరేగిన మంటలు. అగ్నికి ఆహుతైన బోగీలు

Visakha

Visakha

Fire Accident: విశాఖ రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బీ6, బీ7, ఎం1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం లేదు . ఇదే ట్రైన్ విశాఖ నుంచి తిరుపతి వెళ్లాల్సి వుంది. రైలు నాలుగో నెంబర్ ప్లాట్ ఫారం వద్ద ప్రమాదానికి గురైంది. రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో పొగ దట్టంగా కమ్ముకుంది. అధికారులు ప్రయాణికులను బయటకి పంపారు. ఆ సమయంలో రైలులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

 

Read Also: AP Crime: వైసీపీ నేత హత్యతో వణికిపోతున్న సీతారామపురం

 

Show comments