NTV Telugu Site icon

Train Accident: జార్ఖండ్‌లో రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన మూడు కోచ్‌లు

Train

Train

జార్ఖండ్‌ రాష్ట్రం చక్రధర్‌పూర్ రైల్వే డివిజన్‌లోని బారాబంబో రైల్వే స్టేషన్ సమీపంలో హౌరా ముంబై మెయిల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. రైల్వేలోని మూడు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో 6 మందికి గాయాలైనట్లు సమాచారం.

READ MORE: Tollywood: ఒకే నిర్మాణ సంస్థ నుండి రెండు భారీ సినిమాలు..వారం గ్యాప్ లో విడుదల

సంఘటనను ధృవీకరిస్తూ.. చక్రధర్‌పూర్ రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం ఆదిత్య కుమార్ చౌదరి మాట్లాడుతూ..ప్రమాదం గురించి సమాచారం అందుకున్న చక్రధర్‌పూర్ రైల్వే డివిజన్ అధికారులు, వైద్య సిబ్బంది, జిల్లా యంత్రాంగం ఘటనా స్థలానికి చేరారు. అయితే ఈ ఘటనలో ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అంతేకాకుండా.. రైలు నంబర్ 12810 పట్టాలు తప్పిన ఘటన కోసం పరిపాలన హెల్ప్‌లైన్ నంబర్ 0651-27-87115 ను కూడా జారీ చేసింది.

READ MORE:Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

కాగా.. సోమవారం బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు బీహార్ నుండి ఢిల్లీకి వెళుతుండగా దాని కప్లింగ్ లింక్ తెగిపోయింది. కొద్దిసేపటికే రైలులోని రెండు కోచ్‌లు విడిపోయాయి. రైలులో కూర్చున్న ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. అయితే, రైలు కోచ్‌లు విడిపోయిన తర్వాత ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సోమవారం దర్భంగా నుండి న్యూఢిల్లీకి వెళ్తున్న బీహార్ సంపర్క్ క్రాంతి రైలు ఖుదీరామ్ బోస్, పూసా సమస్తిపూర్‌లోని కర్పూరి గ్రామ్ రైల్వే స్టేషన్, ముజఫర్‌పూర్ రైల్వే సెక్షన్ మధ్య రెండు భాగాలుగా విడిపోయింది. ఘటన జరిగిన వెంటనే ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించారు.