Site icon NTV Telugu

Nainital Accident: నైనిటాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Nainital

Nainital

Nainital Accident: ఉత్తరాఖాండ్ రాష్ట్రం నైనిటాల్ జిల్లాలోని ఓఖల్‌కండ బ్లాక్‌లో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో హల్ద్వానీ నుంచి ఓఖల్‌కండ బ్లాక్‌లోని పూదపురి గ్రామానికి వెళ్తున్న మ్యాక్స్‌ వాహనం పాట్లోట్‌ సమీపంలో 200 అడుగుల లోతులో పడిపోయింది. వాహనంలో మొత్తం పన్నెండు మంది ఉన్నారు. ఇందులో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురిని హల్ద్వానీలోని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Read Also: Astrology: జూన్ 06, గురువారం దినఫలాలు

కాగా, మృతుల్లో పుర్పూరికి చెందిన భువన్ చంద్ర భట్ (30 ఏళ్లు), మమత (19 ఏళ్లు), భద్రకోట్ నివాసి ఉమేష్ పర్గై (38 ఏళ్లు) ఉన్నారు. ఘటనాస్థలికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ తో కలిసి సహాయక చర్యలు కొనసాగించారు. మృతదేహాలకు ప్యాట్‌లాట్‌లోనే పోస్టుమార్టం ప్రక్రియ నిర్వహించారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మహేశ్‌ చంద్ర, ఆయన భార్య పార్వతీదేవి, కుమార్తె కవిత మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version