Site icon NTV Telugu

Bathinda Bus Incident: కాలవలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి

Bus Accident

Bus Accident

Bathinda Bus Incident: పంజాబ్‌లోని భటిండాలోని జీవన్ సింగ్ వాలా సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో నిండిన ఓ బస్సు వంతెనపై నుండి నేరుగా మురికి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. 50 మంది ప్రయాణికులతో నిండిన బస్సు ప్రమాదానికి గురైంది. స్థానికులు, అధికారులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టి బస్సు అద్దాలను పగలగొట్టి ప్రయాణికులను బయటికి తీసే ప్రయత్నం చేయడంతో చాలామంది బతికి బయట పడ్డారు. ఈ ప్రమాదం భటిండా-శార్దుల్‌గఢ్ లోకల్ రూట్‌లో ఓ ప్రైవేట్ రవాణా సంస్థకు చెందిన బస్సు ప్రమాదానికి గురవడంతో జరిగింది. బస్సు వంతెనపై నుంచి కింద పడటంతో ఈ తీవ్ర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read: Jio Plans Change: గుర్తుంచుకోండి జియో వినియోగదారులారా.. ఆ ప్లాన్స్ వాలిడిటీని మార్చేసిందిగా

ప్రస్తుతం, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా ప్రమాదం ఎలా జరిగింది అనే అంశంపై స్పష్టత రాలేదు. భటిండా ఎస్‌ఎస్పీ అవనీత్ కొండల్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు వేగంగా జరిగేలా చర్యలు చేపడుతున్నారు. చివరగా పరిస్థితిని క్రమంగా అంచనా వేయాలని అధికారులు తెలిపారు.

Exit mobile version