Road Accident: భారత స్టార్ షూటర్ మను భాకర్ గృహంలో నేడు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే రాష్ట్రపతి చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డును అందుకున్న మను భాకర్‌కి ఈ విషాద సంఘటన బాధ కలిగించింది. రెండు రోజుల క్రితం ఆమె మామ, అమ్మమ్మ మహేంద్రగఢ్ బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనలో ప్రాణాలు కోల్పోయారు. సమాచారం మేరకు మను భాకర్ మామ యుధ్వీర్ సింగ్, అమ్మమలు మహేంద్రగఢ్ బైపాస్ రోడ్డులో స్కూటీపై వెళ్తున్న సమయంలో.. ఒక బ్రెజ్జా కారు రోడ్డుపై స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చర్కీ దాద్రీలో ఈ సంఘటన జరిగిన వెంటనే యాక్సిడెంట్ కు కారకుడైన వాహనం డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పంపించి నిందితుడి కోసం వెతకడం ప్రారంభించారు.
Also Read: sundeep kishan: ఆ రెండు సినిమాలు వదులుకొని తప్పు చేశాను: సందీప్ కిషన్
ఇక మను భాకర్ మామ వయస్సు 50 సంవత్సరాలు కాగా.. అమ్మమ్మ వయస్సు 70 సంవత్సరాలు. మను భాకర్ తన కుటుంబ సభ్యులను ఎంతో ఇష్టపడుతుంది. ఈ సంఘటనతో ఆమెకి తీవ్ర విషాదాన్ని కలిగించింది. మను భాకర్ ఒలింపిక్స్‌లో భారతదేశం కోసం ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలను సాధించి చరిత్ర సృష్టించింది. ఈ ప్రదర్శనతో భారత క్రీడా రంగంలో గొప్ప గుర్తింపును తెచ్చుకున్నది. అయితే, మను భాకర్ కుటుంబానికి సంబంధించి తన అమ్మమ్మ సావిత్రి దేవి కూడా జాతీయ స్థాయిలో పతకాలు సాధించి క్రీడల్లో మంచి పేరు తెచ్చింది. ఈ విషాద సంఘటనతో మను భాకర్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.