NTV Telugu Site icon

Suicide: ఎన్టీఆర్ జిల్లాలో ఆత్మహత్యకి పాల్పడ్డ ప్రేమజంట

Suicide

Suicide

ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం మునగపాడులో ప్రేమజంట ఆత్మహత్య కి పాల్పడింది. జి.కొండూరు మండలం మునగపాడు కి చెందిన ఇల్లా వెంకటేశ్వర్లు ఇద్దరు మహిళల్ని పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్య చందర్లపాడు మండలం ఏటూరు లో నివాసముంటుండగా, రెండవ భార్యతో మునగపాడు లో నివాసముంటున్నాడు వెంకటేశ్వర్లు. అయితే.. వెంకటేశ్వర్లు మొదటి భార్య కుమారుడి కొడుకు (వెంకటేశ్వర్లు మనవడు) ఇల్లా దుర్గాప్రసాద్(17), రెండవ భార్య చిన్న కూతురు(వెంకటేశ్వర్లు కుమార్తె) ఇల్లా పావని(18) మధ్య ప్రేమ చిగురించింది. విషయం తెలియడంతో పెద్దలు మందలించి.. ఇది తగదంటూ హితవు పలికారు. దీంతో.. సోమవారం సాయంత్రం మునగపాడు వచ్చి పావని ని తీసుకుని మునగపాడు గ్రామ శివారులో జన సంచారం లేని ప్రాంతానికి వెళ్లాడు దుర్గాప్రసాద్. తమ ప్రేమ ఫలించే దారి లేకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చిన ప్రేమ జంట.. కూల్ డ్రింక్ లో పురుగుమందు కలుపుకుని త్రాగారు.. దీంతో.. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అయితే.. మంగళవారం ఉదయం మెలుకువ వచ్చి తనకేమీ కాలేదని గ్రహించిన ఇల్లా పావని(18).. ప్రక్కనే పడిఉన్న దుర్గాప్రసాద్(17) మృతి చెందాడని తెలుసుకుని ఇంటికి వచ్చి పెద్దలకు చెప్పింది.. విషయం తెలియడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు.. పావనిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. విషయాన్ని గోప్యంగా జి.కొండూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.