Tamilnadu : తమిళనాడు రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. విరుదునగర్ జిల్లా శివకాశిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా అనేక మందికి గాయాలయ్యాయి. మృతులను ఎస్.కుమరేశన్, ఆర్.సుందరరాజ్, కె.అయ్యమ్మాళ్ గా గుర్తించారు. ఈ ప్రమాదం శివకాశిలోని ఊరంపట్టి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ పేలుడులో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆయన జిల్లాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Also:Mrunal Thakur: మృణాల్ గ్లామర్ మొత్తం ఒకేసారి ఒలికించేస్తోందే
క్షతగాత్రుడిని ఎస్ ఇరులాయిగా గుర్తించారు. కాగా.. ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం సహాయనిధి నుంచి రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేలు సాయం అందిస్తామని చెప్పారు. మృతుల కుటుంబాలకు, స్నేహితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ముగ్గురు వ్యక్తుల మరణవార్త విని చాలా బాధపడ్డానని అన్నారు. ఈ నెల 6న ఇదే రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఉన్న ఓ బాణసంచా ఫ్యాక్టరీలో కూడా పేలుడు సంభవించింది. శివనార్పురం గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఒక మహిళ మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Read Also:IPL 2023: ఆర్సీబీ అద్భుతమైన బ్యాటింగ్.. 10 ఓవర్లకే.. భారీ స్కోర్..?