ముంబైలోని మలాడ్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. మార్వే క్రీక్ లో ఐదుగురు బాలురు గల్లంతయ్యారు. అందులో ఇద్దరు బాలురులను స్థానికులు కాపాడారు. మిగితా ముగ్గురు గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది.
‘ఇండియా టీవీ’ కథనం ప్రకారం.. మార్వే క్రీక్ వద్ద సరదాగా గడిపేందుకు ఐదుగురు బాలురు ఉదయం అక్కడికి వచ్చారు. వారి వయస్సు 12 నుంచి 16 ఏళ్ల వరకు ఉంటుంది. ఉదయం 9.38 గంటల ప్రాంతంలో వారందరూ నీటిలో గల్లంతయ్యారు. దీనిని గమనించిన స్థానికులు.. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే కృష్ణ జితేంద్ర హరిజన్ (16), అంకుష్ భరత్ శివరే (13) అనే ఇద్దరు బాలురను స్థానికులు రక్షించారు. మిగితా ముగ్గురి కోసం అగ్నిమాపక సిబ్బంది బోట్ ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నీటిలో మునిగి గల్లంతైన వారిలో శుభం రాజ్ కుమార్ జైస్వాల్ (12), నిఖిల్ సాజిద్ కయంకుర్ (13), అజయ్ జితేంద్ర హరిజన్ (12)గా గుర్తించారు.
Venugopala Krishna: అక్కడ వైసీపీలో అసమ్మతి లేదు.. మంత్రి వేణుగోపాల్ క్లారిటీ
గల్లంతైన వారి కోసం అగ్నిమాపక సిబ్బంది బోటు సాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తుంది. సహాయక చర్యల్లో భాగంగా.. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ముంబై అగ్నిమాపక దళం, పోలీసులు, కోస్ట్ గార్డ్, నేవీ డైవర్లు, 108 అంబులెన్స్, వార్డు సిబ్బందిని రంగంలోకి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.