NTV Telugu Site icon

Tragedy: హబ్సిగూడలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

Software Engineer Suicide

Software Engineer Suicide

హైదరాబాద్‌లోని హబ్సిగూడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. సీఐ రవీంద్ర నాయక్ తెలిపిన వివరాల ప్రకారం చంద్ర శేఖర్ రెడ్డి(44) హబ్సిగూడాలోని రవీంద్ర నగర్‌లో గత ఎనిమిది నెలలుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య కవిత (35) హౌస్ వైఫ్, కూతురు శ్రీతా రెడ్డి(13) 9వ తరగతి చదువుతుంది. కుమారుడు విశ్వంత్ రెడ్డి (10) 5వ తరగతి చదువుతున్నాడు.

Read Also: Tragedy : హైదరాబాద్‌లో విద్యార్థిని ఆత్మహత్య.. ప్రేమ విషాదాంతం

కాగా.. చంద్రశేఖర్ రెడ్డి ఓ ప్రయివేటు కళాశాలలో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గత ఆరు నెలల క్రితం ఉద్యోగం వదిలేశాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో సోమవారం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో బాబుకు విషం ఇచ్చి, పాపను ఉరి వేసి.. వారు చనిపోయారు అని నిర్ధారించుకున్న తరువాత భార్యా భర్తలు చెరో గదిలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. చంద్రశేఖర్ రెడ్డి స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా కడ్తాల్. ఆత్మహత్య జరిగినట్లు చుట్టుపక్కల వారు గమనించి 100 ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. చనిపోయిన మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తామని పోలీసులు తెలిపారు.

Read Also: Jr Ntr : రూటు మార్చేస్తున్న ఎన్టీఆర్.. పాన్ ఇండియా డైరెక్టర్లే కావాలంట