TX Hospital: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి TX హాస్పిటల్ లోని వైద్య నిర్లక్ష్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాలుకు శస్త్రచికిత్స చేయించేందుకు ఆసుపత్రిలో చేరిన ఏడేళ్ల బాలుడు, ఆపరేషన్ అనంతరం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనపై బాలుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆసుపత్రి వైద్యులపై ఆరోపణలు గుప్పించారు. ఇక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే..
Read Also:Students Letter: ఒక్కసారి మా స్కూల్‌కి రండి.. సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్‌కి విద్యార్థుల ఉత్తరాలు..
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బాలుడు తొలుత ఐదు నెలల క్రితం బంజారాహిల్స్‌లోని TX హాస్పిటల్‌లో కాలుకు సంబంధించి చికిత్స పొందాడు. అప్పట్లో కాలు చికిత్స పూర్తి కాగా, ఇటీవల కాలులో చీము వచ్చి ఇన్ఫెక్షన్ ఏర్పడింది. దీంతో బాలుడిని మళ్లీ మూడు రోజుల క్రితం అదే హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. ఆదివారం (జులై 6) బాలుడి కాలుకు మరోసారి శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే ఆపరేషన్ అనంతరం బాలుడు అకస్మాత్తుగా మృతి చెందాడు. మృతికి కారణంగా గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు.
Read Also:Woman Swallows Pens: ఇదేందయ్యా ఇది..! భర్త మీద కోపంతో పెన్నులు మిగింది.. చివరకు..!
కానీ, బాలుడి కుటుంబ సభ్యులు మాత్రం.. కాలు చికిత్స కోసం వెళ్ళిన మా బాబుకు గుండెపోటు ఎలా వచ్చింది? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది పూర్తిగా వైద్యుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆరోపిస్తున్నారు. అయితే, బాలుడి మృతి పై స్పందించిన బంజారాహిల్స్ పోలీసులు, TX హాస్పిటల్‌పై కేసు నమోదు చేసి, పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
