Site icon NTV Telugu

RCB Victory Rally: స్టేడియం బయట ఆర్తనాదాలు.. లోపల కొనసాగుతున్న వేడుకలు..!

Rcb

Rcb

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవ ర్యాలీలో విషాదం చోటుచేసుకుంది. చిన స్వామి స్టేడియానికి ఆర్సీబీ అభిమానులు పోటెత్తడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అభిమానులు పరుగులు తీయడంతో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 15 మందికి పైగా గాయాలైనట్లు సమాచారం. అయితే.. ఈ నేపథ్యంలో భారీ జనసమూహం కారణంగా ఆర్‌సీబీ ఐపీఎల్ విజయోత్సవ వేడుకల కోసం ఏర్పాటు చేసిన ఓపెన్-బస్ పరేడ్ రద్దు చేశారు. మైదానం బయట పరిస్థితి చాలా గందరగోళంగా మారింది.

READ MORE: DK Shivakumar: చిన్న స్వామి స్టేడియంలో తొక్కిసలాట.. స్పందించిన డిప్యూటీ సీఎం..!

కాగా.. ఆర్‌సీబీ జట్టు నేరుగా ఎం చిన్నస్వామి స్టేడియంకు చేరుకుంది. ఆటగాళ్లు స్టేడియం బాల్కనీ నుంచి అభిమానులను పలకరిస్తున్నారు. వేదిక వెలుపల తొక్కిసలాట జరిగినప్పటికీ.. ఐకానిక్ వేదిక వద్ద వేడుకలు కొనసాగనున్నాయి. విరాట్ కోహ్లీ తన సహచరులతో కలిసి ట్రోఫీని ఎత్తుగా పట్టుకుని ఉండటం ఫొటోల్లో చూడవచ్చు. తొక్కిసలాటలో మరణాలు సంభవించినట్లు వార్తలు వచ్చినప్పటికీ వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఓ వైపు స్టేడియం బయట ఆర్తనాదాలు వినిపిస్తుంటే.. లోపల వేడుకలు చేసుకోవడంపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

READ MORE: Caste Census Survey: కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం.. రెండు దశల్లో సర్వేకు ప్లాన్

Exit mobile version