ట్రాఫిక్ రూల్స్ వాహనదారులకు షాకిస్తున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే… ట్రాఫిక్ రూల్స్ ను పాటించని వారికి కూడా కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 చలాన్లు పెండింగ్ లో ఉన్న వాహనదారులను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు 10 చలాన్ల కంటే ఎక్కువ ఉంటే వారిని స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.
ట్రాఫిక్ ట్రైనిగ్ ఇనిస్టిట్యూట్ కు పోలీసులు పంపిస్తున్నారు. ఈ కౌన్సిలింగ్ లో ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘటనలకు పాల్పడ్డారు… వాటి కారణంగా ఎలాంటి ప్రమాదాలు ఎదురౌవుతాయన్న వాటిపై పోలీసులు అవగాహన కల్పించనున్నారు. కాగా.. పోలీసులు ఎన్ని కఠిన నియమ నిబంధనలు అమలు చేసినా… వాహనదారుల్లో మార్పు రాకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఓవర్ స్పీడ్, తాగి బైక్ నడుపుతూనే ఉన్నారు కొందరు.
