Site icon NTV Telugu

Traffic Diversion : హైదరాబాద్ లో హనుమాన్ శోభయాత్ర… ట్రాఫిక్ ఆంక్షలు..

Traffic Restrictions

Traffic Restrictions

రేపు హైదరాబాద్ లో హనుమాన్ శోభయాత్ర సందర్భంగా… ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ మేరకు ట్రాఫిక్ డైవర్షన్ పై రూట్ మ్యాప్ విడుదల చేశారు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి.. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డైవెర్షన్ రూట్ లో వెళ్లాలని సూచించారు. రేపు హనుమాన్ విజయయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టారు. హనుమాన్ శోభాయాత్ర గౌలిగూడ రామ మందిరం నుండి ప్రారంభమై సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ మందిర్‌కి వెళ్తుందని, గౌలిగూడ రామ మందిరం నుండి మొదలై పుత్లీబౌలీ క్రాస్ రోడ్స్, ఆంధ్రబ్యాంక్ క్రాస్ రోడ్స్, కోటి, డీఎం అండ్ హెచ్ఎస్, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, రామకోటి క్రాస్ రోడ్స్, కాచీగూడ క్రాస్ రోడ్స్, నారాయణగూడ YMCA, చిక్కడపల్లి క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీనగర్, వైశ్రాయ్ హోటల్ వెనకవైపు, ప్రాగా టూల్స్, కవాడీగూడ, CGO టవర్స్.. బన్సీలాల్ పేట్ రోడ్, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా షోరూమ్, ఉజ్జయినీ మహంకాళి టెంపుల్, ఓల్డ్ రాంగోపాలపేట్ పీఎస్, ప్యారడైజ్ క్రాస్ రోడ్స్, CTO జంక్షన్.. లీ రాయల్ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపెరియల్ గార్డెన్, మస్తాన్ కేఫ్, తాడ్ బండ్ హనుమాన్ ఆలయం దగ్గర లెఫ్ట్ టర్న్ దిశగా ఈ హనుమాన్ శోభాయాత్ర సాగనుంది..

12 కిలోమీటర్లు మేర హనుమాన్ శోభయాత్ర… ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతర పోలీసు భద్రత, గస్తీ,సీసీ కెమెరాల కనుసన్నల్లో హనుమాన్ శోభ యాత్ర.. రాత్రి 8 గంటలకు ముగియనున్న హనుమాన్ శోభ యాత్ర.. హైదరాబాద్ లో 21 ట్రాఫిక్ డైవెర్షన్స్.. రేపు ఉదయం 11:30 రాత్రి 8గంటల వరకు ట్రాఫిక్ డైవెర్షన్స్ ఫాలో అవ్వండని హైదరాబాద్ సీపీ తెలిపారు. కూడళ్లలో 44చోట్ల డైవెర్షన్ పాయింట్స్.. రేపు హైదరాబాద్ నగర పరిధిలో మద్యం దుకాణాలు, బార్లు మూసేయాలని ఉత్తర్వులు జారీచేశారు హైదరాబాద్ నగర సీపీ శ్రీనివాస్ రెడ్డి.. హనుమాన్ జయంతి సందర్భంగా వైన్స్ షాపులను బంద్ చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని సీపీ శ్రీనివాస్ రెడ్డి, రేపు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు 24 గంటలపాటు మూసివేయాలని సూచించారు.

Exit mobile version