NTV Telugu Site icon

Sadar Utsav: నేడు హైదరాబాద్ లో సదర్ ఉత్సవాలు.. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు

Sadar Ustav

Sadar Ustav

నేడు హైద‌రాబాద్ నారాయణగూడలోని వైఎంసీఏలో రాత్రి 7 గంటల నుంచి రేపు తెల్లవారుజామున 3 గంటల వరకు సదర్‌ ఉత్సవ్‌ మేళా జరగనుంది. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. కాచిగూడ ఎక్స్ రోడ్స్ నుంచి వైఎంసీఏ, నారాయణగూడ వైపు వెహికిల్స్ కు పర్మిషన్ రద్దు చేశారు. వీటిని కాచిగూడలోని టూరిస్ట్ హోటల్ వైపు మళ్లించనున్నారు. విట్టల్‌వాడి ఎక్స్ రోడ్స్ నుంచి వైఎంసీఏ, నారాయణగూడ వైపు ట్రాఫిక్‌ను రాంకోటి ఎక్స్ రోడ్స్ వైపుకు మళ్లీంచారు.

Read Also: Devara: అనిరుధ్-ప్రేమ్ రక్షిత్-ఎన్టీఆర్… ఈ కాంబినేషన్ స్క్రీన్స్ ని తగలబెట్టేస్తాయి

ఇక, రాజ్‌మొహల్లా నుంచి వచ్చే వాహనాలను అనుమతించరు. సాబూ షాప్ పాయింట్ దగ్గర రాంకోటి ఎక్స్ రోడ్స్ వైపు మళ్లీంచనున్నారు. రెడ్డి కళాశాల నుంచి వెహికిల్స్ ను బర్కత్‌పురా వైపు మళ్లించనున్నారు. అయితే, పాత బర్కత్‌పురా పోస్టాఫీసు నుంచి వైఎంసీఏ, నారాయణగూడ వైపు వచ్చే ట్రాఫిక్‌కు పోలీసులు చెక్ పెట్టారు. క్రౌన్ కేఫ్ లేదా లింగంపల్లి వైపు మళ్లిస్తారు. దీంతో పాటు పాత ఎక్సైజ్ ఆఫీస్ లైన్ నుంచి వైఎంసీఏ, నారాయణగూడ వైపు వచ్చే వాహనాలను విట్టల్‌వాడి వైపుకు మళ్లీంపు.. బర్కత్‌పురా చమన్ నుంచి వైఎంసీఏ, నారాయణగూడ వైపు వచ్చే వాహనాలను బర్కత్‌పురా ఎక్స్ రోడ్స్ వైపు లేదా టూరిస్ట్ హోటల్ వైపుకు మళ్లీంచనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. అలాగే, బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ నుంచి రెడ్డి కాలేజీ వైపు వెళ్లే వాహనాలను నారాయణగూడ ఎక్స్ రోడ్స్ వైపు మళ్లించనున్నారు. ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు.