Site icon NTV Telugu

Hyderabad Traffic Alert : హైదరాబాద్‌లో నేటి నుంచి 40 రోజులు ఆ రూట్‎కు వెళ్లకండి

Traffic Diversion

Traffic Diversion

Hyderabad Traffic Alert : హైదరాబాద్‌లో నేటి నుంచి 40 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. నగరంలోని అంబర్‌పేటలో ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనుల నేపథ్యంలో గాంధీ విగ్రహం వద్ద నుంచి అంబర్‌పేట టీ జంక్షన్‌ వరకు రోడ్డు మూసేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మూసివేత నేటినుంచి మార్చి 10వ తేదీ వరకు 40 రోజుల పాటు ఉండనుంది. ఆ రూట్‌లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. గాంధీ విగ్రహం నుంచి 6 నంబర్‌ బస్టాప్‌ వరకూ వెళ్లే మార్గంలో (ఒకవైపు) వాహనాలను అనుమతించకుండా ఆంక్షలు విధించినట్టు చెప్పారు.

Read Also: Harish Rao: రోగులను పట్టించుకోకుంటే ఇంటికే.. మంత్రి హరీశ్ రావు గట్టి వార్నింగ్

ఉప్పల్‌ వైపు నుంచి 6 నంబర్‌ బస్టాప్‌ మీదుగా చాదర్‌ఘాట్‌ వెళ్లే భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు హబ్సిగూడ క్రాస్‌రోడ్స్‌ నుంచి తార్నాక, ఉస్మానియా వర్సిటీ, అడిక్‌మెట్‌ ఫ్లైఓవర్‌, విద్యానగర్‌, ఫీవర్‌ దవాఖాన, బర్కత్‌పురా, నింబోలి అడ్డా వైపునకు వాహనాలను మళ్లించనున్నారు. ఇక ఇదే మార్గంలో వెళ్లే సిటీ బస్సులు, సాధారణ వాహనాలను గాంధీ విగ్రహం నుంచి ప్రేమ్‌ సదన్‌ బాయ్స్‌ హాస్టల్‌, సీపీఎల్‌ అంబర్‌పేట్‌ గేట్‌, అలీఖేఫ్‌ క్రాస్‌రోడ్స్,. 6 నంబర్‌ బస్టాప్‌, గోల్నాక, నింబోలి అడ్డా మీదుగా చాదర్‌ఘాట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఛే నంబర్‌ బస్టాప్‌ వైపు నుంచి ఉప్పల్‌ వైపు వెళ్లే అన్ని వాహనాలను అనుమతిస్తారు.

Read Also: Water Contamination : హిమాచల్ ప్రదేశ్‎లో కలుషిత నీరు తాగి 535మందికి అస్వస్థత

Exit mobile version