Avakaya Pickle Recipe: ముక్క మెత్తబడకుండా.. రంగు మారకుండా.. పర్ఫెక్ట్ కొలతలతో ‘ఆవకాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Avakaya Pickle Recipe: మామిడికాయల సీజన్ వచ్చేసింది. ఆవకాయ పచ్చడి అనగానే మనందరికీ అమ్మమ్మలు, నాన్నమ్మలు గుర్తొస్తారు. వేడి వేడి అన్నం, ముద్దపప్పు, ఆ పైన కాస్త ఎర్రటి ఆవకాయ పచ్చడి.. అబ్బ ఆ ఊహే ఎంత బాగుంటుంది కదా.. మన తెలుగువారికి ఆవకాయ అంటే కేవలం పచ్చడి మాత్రమే కాదు, అదొక ఎమోషన్. మామిడికాయల సీజన్ వచ్చిందంటే చాలు.. ఇళ్లన్నీ ఆవపిండి ఘాటుతో, వేయించిన నూనె వాసనతో నిండిపోతాయి. మొదటిసారి పచ్చడి పెట్టేవారు కూడా అస్సలు కంగారు పడకుండా, కొలతలు తప్పుపోకుండా సంవత్సరం పాటు ముక్క గట్టిగా ఉండేలా పర్ఫెక్ట్ కొలతలతో ‘ఆవకాయ పచ్చడి’ ని ఇలా చేసేద్దాం. వెయిట్ మిషన్లతో పనిలేకుండా ఇంట్లో ఉండే గ్లాస్ కొలతలతో సులభంగా ఎలా చేసుకోవాలో చూద్దాం.
Hardik Pandya: ఏం మాట్లాడాలో తెలియడం లేదు.. ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థం కావడం లేదు!
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
అవసరమైన పదార్థాలు:
* మామిడికాయ ముక్కలు – 6 గ్లాసులు
* పచ్చళ్ల కారం – 1 గ్లాసు
* ఆవపిండి – అర (1/2 ) గ్లాసు నుండి ముక్కాల్ (3/4) గ్లాసు
* మెంతిపిండి – 1/4 గ్లాసు
* ఉప్పు (కల్లుప్పు పొడి) – 3/4 గ్లాసు
* నువ్వుల పప్పు నూనె – 2 గ్లాసులు
* వెల్లుల్లి రెబ్బలు – 1/4 గ్లాసు
* పసుపు – 1 టీస్పూన్
తయారీ విధానం:
మామిడికాయల ఎంపిక & ప్రిపరేషన్:
ఆవకాయ కోసం కాయ పుల్లగా, పీచు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం మంచించింది. వీటికోసం దెగ్గరలోని మార్కెట్ కు వెళితే అక్కడ దొరికే మామిడికాయలు పరిశీలించి ఎంచుకోవడం శ్రేయస్కరం. అక్కడ కొన్న కాయలను ఇంటికి తీసుకొచ్చాక కడిగి, తడి లేకుండా తుడిచి ముక్కలుగా కొట్టుకోవాలి. ఆపై ముక్కల్లోని జీడిని తీసేసి, టెంక మీద ఉండే తెల్లటి పొరను శుభ్రం చేయాలి. ఈ ముక్కలను పొడి క్లాత్‌తో తుడిచి, 10 నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. (ఇలా చేస్తే ముక్క మెత్తబడదు).
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కారణంగా.. బీసీసీఐకి కొత్త తలనొప్పి స్టార్ట్.. ఎందుకంటే..
ముక్కలకు నూనె పట్టించడం:
ఒక పళ్ళెంలోకి 6 గ్లాసుల ముక్కలను తీసుకోండి. అందులో ఒక గ్లాసు నువ్వుల నూనె, ఒక స్పూన్ పసుపు వేసి ముక్కలన్నింటికీ పట్టేలా బాగా కలపాలి. ఇలా నూనె ముందే పట్టించడం వల్ల ముక్కకు రక్షణ కవచం ఏర్పడి ఏడాది పాటు గట్టిగా ఉంటుంది.
మసాలా మిశ్రమం:
మరొక గిన్నెలో కారం, ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ పొడుల మిశ్రమాన్ని నూనె పట్టించిన మామిడికాయ ముక్కల్లో వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో వలిచిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి ముద్దను వేయండి. చివరగా మిగిలిన ఒక గ్లాసు నువ్వుల నూనెను కూడా పోసి మొత్తం కలిసేలా కలపాలి.
నిల్వ చేసే పద్ధతి:
పచ్చడి నిల్వ చేసే జాడీ అడుగున కొంచెం నూనె వేసి స్ప్రెడ్ చేయాలి. కలిపి పెట్టుకున్న పచ్చడిని జాడీలోకి మార్చి, పైన మూత పెట్టి తెల్లటి క్లాత్ తో కట్టేయాలి. దీనిని మూడు రోజుల పాటు కదపకుండా పక్కన పెట్టాలి. మూడు రోజుల తర్వాత మూత తీసి చూస్తే నూనె చక్కగా పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు పచ్చడిని ఒకసారి బాగా కలుపుకుని ఉప్పు టేస్ట్ చూడండి. సరిపోకపోతే ఏది తక్కువైంది అనిపించిందో దానిని సర్దుబాటు చేసుకుంటే మంచింది. ఒకవేళ నూనె తక్కువ అనిపిస్తే మరికొంత నూనె పోయండి. పచ్చడి పైన నూనె తేలుతూ ఉంటేనే ఏడాది పాటు పాడవకుండా ఉంటుంది.
కొన్ని ముఖ్యమైన చిట్కాలు:
నూనె: ఆవకాయ రుచి పెరగాలన్నా, ముక్క గట్టిగా ఉండాలన్నా ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె లాంటి స్వచ్ఛమైన నూనె వాడటం మంచిది.
తడి: పచ్చడి ప్రాసెస్ మొత్తంలో ఎక్కడా తడి తగలకుండా చూసుకోవాలి. వాడే గిన్నెలు, గరిటెలు పూర్తిగా పొడిగా ఉండాలి.
ఆవపిండి: ఆవాలను ఎండలో పెట్టి పొడి చేసుకుంటే రుచి బాగుంటుంది.
ఈ సంప్రదాయ పద్ధతిలో ఆవకాయ పెట్టి చూడండి, మీ ఇంటి ఆవకాయ రుచి చుట్టుపక్కల అందరికీ తెలిసిపోతుంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!