NTV Telugu Site icon

Tractor Goes Viral : ట్రాక్టర్ పై దెయ్యం..? దానంతట అదే స్టార్ట్ అయ్యి..

Tractor

Tractor

Tractor Goes Viral : ప్రస్తుతంలో సోషల్ మీడియాలో ఓ ట్రాక్టర్ చర్చనీయాంశమైంది. దానికి సంబంధించిన వీడియో గురించి నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. కారణం ఓ షాపుముందున్న ట్రాక్టర్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవ్వడం అంతటితో ఆగకుండా దుకాణంలోకి చొచ్చుకెళ్లడం. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఓ షాపు ముందు ఒక ట్రాక్టర్ పార్క్ చేసి ఉంది. షాపు లోపల సిబ్బంది ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు. ఇంతలో షాపు బయట పార్క్ చేసి ఉన్న ఆ ట్రాక్టర్ డ్రైవర్ లేకుండానే ఆటోమెటిక్‌గానే స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన ట్రాక్టర్ అంతటితో ఆగితే బాగుండేది. కానీ అది ఆన్ అయినప్పుడు గేర్‌లో ఉండటంతో ట్రాక్టర్ ముందుకు కదిలింది. షాపు మెట్లు అడ్డం వచ్చినా అవేవి దాన్ని ఆపలేకపోయాయి.

Read Also: Viral Video: ఎంత తింటున్నావురా.. నోట్లో పెట్టుకున్న నోట్లు కక్కుతావా.. లేదా.. ?

ఆ మెట్లను కూడా దాటుకుని వచ్చి దుకాణం అద్దాలను ఢీకొట్టింది. తక్కువ స్పీడ్‌లోనే ఉండడంతో దుకాణం అద్దాలు కొద్దిసేపటి వరకు ట్రాక్టర్‌ను నిలువరించే ప్రయత్నం చేశాయి. కానీ ట్రాక్టర్ నెమ్మదిగా వేగం పెరిగింది. దీంతో దుకాణం అద్దాలు కూడా పగిలిపోయాయి. అలాగే అద్దాలను పగలకొట్టుకుని ముందుకొచ్చిన ట్రాక్టర్‌ను మరో మెట్టు అడ్డు పడింది. అంతలోనే దుకాణంలోంచి బయటికి పరుగెత్తిన సిబ్బంది ఒకరు.. ట్రాక్టర్ బ్రేకుపై చేయి వేసి ఆపడం జరిగింది. అంతలోనే మరో వ్యక్తి పరుగెత్తుకొచ్చి డ్రైవర్ సీటులో కూర్చుని ట్రాక్టర్‌ను కంట్రోల్ చేశాడు. ఈ దృశ్యం మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.