దేశం గర్వించేలా ఆట తీరు కనబరుస్తామన్నారు బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్. టీపీసీసీ ఆధ్వర్యంలో నిఖత్ జరీన్ కు సన్మానం జరిగింది. హైదరాబాద్ నిజాం క్లబ్ లో జరిగిన సన్మాన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరయ్యారు హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, మహేశ్ కుమార్ గౌడ్, అజారుద్దీన్, ఇతర నేతలు. నిఖత్ జరీన్ సాధించిన విజయాన్ని గౌరవిస్తూ పార్టీ తరపున 5లక్షలు బహుమతిగా ప్రకటించాము. మేమంతా జరీన్ తో ఉన్నామని చెప్పేందుకే ఈ బహుమతిని ప్రకటించాం అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా ఉండాలనే నిజాం క్లబ్ లో కార్యక్రమం ఏర్పాటు చేసాం. క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమం.ఇందులో ఎలాంటి ఇతర ఉద్దేశాలు లేవన్నారు.
Read Also: Brothers Died: మెట్ పల్లిలో విషాదం… తమ్ముడి మరణం తట్టుకోలేక ..
రాజకీయాల్లోనూ క్రీడా స్ఫూర్తి అవసరం. మగవాళ్ళు ఆడే ఆట అని అడ్డు చెప్పకుండా జరీన్ ను తల్లిదండ్రులు ప్రోత్సహించారు.ఇందుకు నిఖత్ జరీన్ కుటుంబాన్ని అభినందనలు తెలిపారు. స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిఖత్ జరీన్ కు స్థలాన్ని కేటాయించాలి. అన్ని రకాల సౌకర్యాలతో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయాలి. 26 జనవరిలోగా గ్రూప్ 1 ఆఫీసర్ గా నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నా. మరింత గొప్పగా నిఖత్ జరీన్ ను సన్మానించేలా మరో కార్యక్రమం ఏర్పాటు చేయాలని పార్టీ నేతలకు సూచిస్తున్నా అన్నారు రేవంత్ రెడ్డి.
బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించినందుకు కృతజ్ఞతలు. రేవంత్ రెడ్డిగారు బహుమతి ప్రకటించడం సంతోషంగా ఉంది. అందరి సపోర్ట్ ఉంటే దేశం గర్వించేలా ఆట తీరు కనబరుస్తాం అన్నారు నిఖత్ జరీన్.
Read Also: Karnataka: శ్రీరామ్ సేన కార్యకర్తపై దుండగుల కాల్పులు..
