వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ వివాదంపై సీఈఓ చర్యలు తీసుకోవాలి అని కోరారు. కావాలనే వ్యూహాత్మకంగా ఈ వివాదం సృష్టించారు.. ఎవరు, ఎందుకు, ఏం ఆశించి ఈ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రజలకు తెలుసు అని చెప్పారు. సాగర్ డ్యాం అక్కడే ఉంటుంది.. నీళ్లు ఎక్కడికి పోవు.. ఏ రాష్ట్రంలో సమస్య ఉన్నా.. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి.. ఇలాంటి కుట్రలు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపించవు అని రేవంత్ రెడ్డి తెలిపారు.
Revanth Reddy: కొడంగల్ లో ఓటేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Revanth Reddy