Site icon NTV Telugu

Mahesh Kumar Goud: దాతృత్వం చాటుకున్న టీపీసీసీ చీఫ్.. గ్రామాభివృద్ధికి 11 ఎకరాల భూమి విరాళం..

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దాతృత్వం చాటుకున్నారు. గ్రామాభివృద్ధికి 11 ఎకరాల భూమి విరాళంగా ఇచ్చారు. తన స్వగ్రామం రహత్ నగర్‌లో అభివృద్ధి పనుల నిమిత్తం ఇచ్చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు పది ఎకరాలు, సబ్ స్టేషన్‌కు ఎకరా తన స్వంత భూమిని విరాళంగా ఇచ్చారు. టెంపుల్ కారిడార్ ను తన గ్రామం మీదుగా మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు మహేష్ కుమార్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం స్వగ్రామమైన రహత్‌నగర్‌లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో గ్రామప్రజలు భారీ గజమాలతో సత్కరించారు.

READ MORE: iBOMMA Ravi Father: ఐ బొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలన్న నిర్మాత.. కౌంటర్ ఇచ్చిన తండ్రి

గ్రామంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.50 లక్షలతో నిర్మిస్తున్న దుర్గాదేవి నూతన ఆలయ భూమి పూజలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. “బాల్యం తీపి గుర్తులను ఎప్పటికీ మరిచిపోలేను. తల్లిదండ్రులు చేసిన సేవల వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదు. గ్రామంతో నా అనుబంధం చివరి శ్వాస వరకు కొనసాగుతుంది. గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాను. గ్రామం మీదుగా వెళ్లే టెంపుల్ కారిడార్ రోడ్డు కోసం సీఎం, సంబంధిత మంత్రితో మాట్లాడి రూ. 380 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించడం జరిగింది. ఈ రహత్‌నగర్ టెంపుల్ కారిడార్ రోడ్‌తో కరీంనగర్–నిజామాబాద్ మధ్య సెంటర్ పాయింట్ అవుతుంది. గ్రామానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉన్నత విద్య సౌకర్యాలు లభిస్తాయి. గ్రామ అభివృద్ధి చేయడం నా బాధ్యతగా భావిస్తున్నా.” అని మహేష్ కుమార్ గౌడ్ వ్యా్ఖ్యానించారు.

Exit mobile version