NTV Telugu Site icon

TPCC Mahesh Goud : జీఓ 29తో నష్టం అనేది అపోహ మాత్రమే.. ఎవరికి నష్టం జరగదు

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

గ్రూప్ 1 పరీక్ష పై.. బీజేపీ.. బీఆర్‌ఎస్‌ కుమ్మక్కై లేనిపోని అనుమానాలు సృష్టిస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని, బీసీ బిడ్డగా.. నేను మీకు మాట.. భరోసా ఇస్తున్నానన్నారు. సెలక్షన్ ప్రక్రియలో ఎక్కడా.. రిజర్వేషన్‌ కేటగిరీకి అన్యాయం జరగదన్నారు. ఇది..మా పార్టీ ప్రభుత్వం నుండి ఇస్తున్న భరోసా అని, జీఓ 29తో నష్టం అనేది అపోహ మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ కోటా ప్రకటించేటప్పుడు ఎవరికి నష్టం జరగదని, 75 శాతం వరకు ఎస్సీ.. ఎస్టీ అని, బీసీ విద్యార్థులే లాభ పడతారన్నారు మహేష్ కుమార్‌ గౌడ్‌. మీరు అపోహ పడకండి అని, మాక్కూడా ఉన్న అనుమానాలు మంత్రులతో మాట్లాడిన అని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని అభిప్రాయాలు అధ్యయనం చేసిన తర్వాత మాకు క్లారిటీ వచ్చిందని, జీవో 29 కోర్టులో ఉన్న అంశం అని, విద్యార్దులు తొందర పడకండన్నారు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. బాగా పరీక్షలు రాయండని, మీకు అన్యాయం జరగదు..నేను భరోసా ఇస్తున్న అని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్.. మీ హయం లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు.. మీరు నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు అని ఆయన అన్నారు.

6G Technology:6జీ వచ్చేస్తోంది? 50జీబీ సినిమా ఒక్క సెకనులో డౌన్‌లోడ్..!

అంతేకాకుండా..’బీఆర్‌ఎస్‌ నియామకాల పేరుతో నే అధికారం లోకి వచ్చింది. పదేళ్లలో టీజీఎస్పీఎస్సీ నుండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. పదేళ్లలో పట్టుమని.. 35 వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ ద్వారా ఇచ్చారు. 10 యేండ్ల లో 70 వేల ఉద్యోగాలు ఇచ్చిన brs కి చిత్తశుద్ధి ఉందా. . పది నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ కి కమిట్ మెంట్ ఉందా..? బీఆర్‌ఎస్‌ ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చారా.. ఇన్నాళ్లు ఉద్యోగాలు ఇవ్వని మీరు ఇప్పుడు ధర్నా చేస్తున్నారు.. ఇంటర్ మీడియట్ ఫలితాలు సక్కగా ఇవ్వలేని మీరు మా గురించి మాట్లాడుతున్నారు.. నోటిఫికేష్ వచ్చి ఐదు నెలలు అయ్యింది.. చాలా మంది విద్యార్థులు పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్‌ఎస్‌.. బీజేపీ మాటలు నమ్మి జీవితాలు నాశనం చేసుకోకండి.. జీవో 29 తో మీకు లాభమే.. నష్టం ఉండదు.. తొందర పడకండి.. పోలీసులకు విజ్ఞప్తి. లాఠీచార్జి లేకుండా చూడండి.. తొందర పడకండి..ఇబ్బంది పెట్టకండి.. మేము చర్చలకు ఐనా పిలుస్తున్నాం.. బీఆర్‌ఎస్‌ ఒక్కసారి ఐనా ఎవరినైనా పిలిచి మాట్లాడారా..? ఫిబ్రవరి 23 న జీవో ఇచ్చింది.. ఆప్పటి నుండి ఎందుకు సమస్య ఉందని చెప్పలేదు.. ఇప్పుడు రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేస్తున్నారు.. కమ్యూనికేషన్ లోపమే తప్పితే.. జీఓ 29 తో ఎవరికి నష్టం జరగదు.. తొందరపడకండి..’ అని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు.

Baba Siddique murder: బాబా సిద్ధిక్ హత్యలో మరొకరి అరెస్ట్.. ఆయుధాలు అందించింది ఇతనే..

Show comments