NTV Telugu Site icon

Toyota Offers 2024: ఇయర్ ఎండ్ ఆఫర్‌.. ఈ టయోటా కార్లపై లక్ష తగ్గింపు!

Toyota Cars Offers 2024

Toyota Cars Offers 2024

జపనీస్ కార్ల తయారీ సంస్థ ‘టయోటా’ తన మూడు మోడళ్ల ప్రత్యేక ఎడిషన్ వేరియంట్‌లను తాజాగా విడుదల చేసింది. గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ టైజర్, అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ల ప్రత్యేక పరిమిత ఎడిషన్‌లను బుధవారం రిలీజ్ చేసింది. అన్ని టయోటా డీలర్‌షిప్‌లు, అధికారిక టయోటా వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఎడిషన్ మోడళ్ల బుకింగ్‌లు ఓపెన్ అయ్యాయి. లాంచ్ సందర్భంగా ప్రత్యేక ఎడిషన్ ప్యాకేజీ లేదా ప్రత్యేక ఇయర్ ఎండ్ ఆఫర్‌లను ఎంపిక చేసుకునే అవకాశం కొనుగోలుదారులుకు ఉంది.

ప్రత్యేక పరిమిత ఎడిషన్ కాకుండా.. టొయోటా గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ టైజర్, రూమియన్‌ల నాన్-సీఎన్‌జీ వేరియంట్‌లపై రూ.1 లక్ష కంటే ఎక్కువ ప్రత్యేక ఇయర్ ఎండ్ ఆఫర్‌ను కంపెనీ అందిస్తోంది. కొనుగోలుదారులు డిసెంబర్ 31 వరకు ఈ ప్రయోజనాలను పొందవచ్చు. టయోటా ఇండియా లైనప్‌లో గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ టైజర్, రూమియన్, అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్, హిలక్స్, ఫార్చ్యూనర్, లెజెండర్, క్యామ్రీ, వెల్‌ఫైర్, ల్యాండ్ క్రూయిజర్ 300 ఉన్నాయి.

Also Read: Sanju Samson: సంజూ శాంసన్‌ చెత్త రికార్డు.. మనోడే తొలి బ్యాటర్‌!

టొయోటా గ్లాంజా స్పెషల్ ఎడిషన్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అన్ని ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఎడిషన్ డోర్ వైజర్, లోయర్ గ్రిల్ గార్నిష్, ఓర్వీఎం గార్నిష్, రియర్ ల్యాంప్ గార్నిష్, ఫ్రంట్ బంపర్ గార్నిష్, ఫెండర్ గార్నిష్, బంపర్ కార్నర్ ప్రొటెక్టర్‌తో వస్తుంది. అర్బన్ క్రూయిజర్ టైజర్ మూడు (E, S, S+) వేరియంట్‌లలో ఉన్నాయి. హైరైడర్ స్పెషల్ ఎడిషన్ ఎంట్రీ లెవల్ E ట్రిమ్ మినహా అన్ని పెట్రోల్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. హైబ్రిడ్ మోడల్ ప్రత్యేక ఎడిషన్ G, V ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది.

Show comments