Site icon NTV Telugu

Toxic : టాక్సిక్ టీజర్.. యష్‌తో ఇంటిమేట్ సీన్స్‌లో రెచ్చిపోయిన బ్యూటీ ఎవరో తెలుసా?

Tixic Teasur Actress Natalie Burn

Tixic Teasur Actress Natalie Burn

కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ టీజర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత యష్‌ను ‘రాయ్’ అనే ఊరమాస్ మరియు డార్క్ షేడ్ ఉన్న పాత్రలో చూస్తుంటే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. అయితే, ఈ టీజర్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం యష్‌తో ఉన్న ఒక బోల్డ్ ఇంటిమేట్ సీన్. ఈ సీన్‌లో యష్‌తో కలిసి రెచ్చిపోయి నటించిన ఆ విదేశీ భామ ఎవరనేదానిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆమె మరెవరో కాదు, హాలీవుడ్ నటి మార్షల్ ఆర్ట్స్ నిపుణురాలు నటాలీ బర్న్. ఉక్రెయిన్ మూలాలున్న ఈ బ్యూటీ ‘ది ఎక్స్‌పెండబుల్స్ 3’, ‘మెకానిక్: రిసరెక్షన్’ వంటి భారీ యాక్షన్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందింది.

Also Read : Niharika-Rakasa : నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘రాకాస’.. రిలీజ్ డేట్ ఫిక్స్!

కేవలం నటిగానే కాకుండా మోడల్, స్క్రీన్ రైటర్ మరియు నిర్మాతగా కూడా నటాలీకి మంచి పేరుంది. సుమారు 150 కోట్ల రూపాయల ఆస్తి కలిగిన ఈమె, ‘టాక్సిక్’ సినిమాతో ఇండియన్ స్క్రీన్ మీద అడుగు పెట్టడమే కాకుండా ఈ చిత్రానికి ఒక నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నప్పటికీ, టీజర్‌లో నటాలీ బర్న్ చూపించిన గ్లామర్ మరియు బోల్డ్ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మార్చి 19న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version