Site icon NTV Telugu

Toxic : టాక్సిక్’ టీజర్‌పై మహిళా కమిషన్ ఫైర్‌.. యశ్ సినిమాకు పెద్ద షాక్!

Toxic Yash

Toxic Yash

కన్నడ రాకింగ్ స్టార్ యష్ దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ‘టాక్సిక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి వరుస అప్‌డేట్ లు వదులుతుండగా..తాజాగా విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో యష్ ‘రాయ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో, మునుపెన్నడూ లేని విధంగా డార్క్ అండ్ బోల్డ్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించారు. శ్మశాన వాటిక నేపథ్యం, భారీ మెషిన్ గన్‌తో యష్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. అయితే, టీజర్‌లో చూపించిన కొన్ని సీన్లు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి.

Also Read : Anaganaga Oka Raju : రాజు ఎలా ఉండాలో చెప్పిన రాజకుమారి.. మీనాక్షి

ముఖ్యంగా కారులో చిత్రీకరించిన అత్యంత బోల్డ్.. ఇంటిమేట్ సీన్లపై నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ ఈ సినిమా టీజర్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టీజర్‌లోని అశ్లీల దృశ్యాలు సమాజంపై తప్పుడు ప్రభావం చూపుతాయని మండిపడుతూ, వెంటనే ఆ టీజర్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సెన్సార్ బోర్డుకు కూడా లేఖ రాసింది. మరి ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Exit mobile version