Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bribe in Dead Drop Method: లంచం తీసుకోవడంలో కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారనే ఆరోపణలతో టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ఏసీబీకి చిక్కిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా డ్రగ్స్ సరఫరాలో వినియోగించే ‘డెడ్ డ్రాప్’ తరహాలోనే లంచం డబ్బులు తీసుకునేందుకు ఆమె ప్రయత్నించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఓ వ్యాపారవేత్త నుంచి లంచం కోసం సునీత ఏకంగా రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. అంత మొత్తం ఇవ్వలేనని బాధితుడు చెప్పడంతో కనీసం రూ.8 లక్షలు ఇవ్వాలని ఆమె షరతు పెట్టినట్లు తెలుస్తోంది. చివరకు టోకెన్ అమౌంట్‌గా రూ.4 లక్షలు ఇవ్వడానికి వ్యాపారవేత్త అంగీకరించినట్లు సమాచారం.
Also Read
- Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
అయితే డబ్బులను నేరుగా తన చేతికి ఇవ్వకుండా సునీత ప్రత్యేక పద్ధతిని అనుసరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రద్దీగా ఉండే ప్రాంతంలో తన కారును ఆపి, కారు డిక్కీని తెరిచి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. లంచం ఇచ్చే వ్యక్తి ఆ డిక్కీలో డబ్బులు పెట్టి, అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆమె సూచించినట్లు సమాచారం.
బాధితుడు సునీత సూచన మేరకు రూ.4 లక్షలను కారు డిక్కీలో ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఏసీబీ అధికారులు పర్యవేక్షిస్తూ, అనంతరం కారును స్వాధీనం చేసుకుని డిక్కీలో ఉన్న లంచం డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగడంతో సునీత షాక్‌కు గురైంది. తన చేతులతో డబ్బులు ముట్టుకోలేదని, డిక్కీలోకి డబ్బులు ఎలా వచ్చాయో తనకు తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా చేతులకు రసాయన రంగు అంటుకుంటేనే లంచం తీసుకున్నట్లు నిర్ధారణ అవుతుందని వాదించారు కూడా.
సునీత గతంలోనూ ఇదే తరహా పద్ధతిలో లంచం తీసుకున్నట్లు ఏసీబీ విచారణలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. మరో బాధితుడు సుమారు రూ.2.50 లక్షలను కూడా ఆమె కారు డిక్కీలోనే ఉంచి వెళ్లినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో రెండు వ్యవహారాలకు సంబంధించి మొత్తం రూ.6.50 లక్షల లంచం డబ్బులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నేరుగా డబ్బులు తీసుకోకుండా ‘డెడ్ డ్రాప్’ తరహా విధానాన్ని ఉపయోగించి లంచం స్వీకరించేందుకు ప్రయత్నించిన ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!