Site icon NTV Telugu

Towhid Hridoy: బంగ్లాదేశ్‌ ఆటగాడిపై నిషేధం!

Towhid Hridoy Ban

Towhid Hridoy Ban

బంగ్లాదేశ్‌ ఆటగాడు తౌహిద్‌ హృదోయ్‌పై నిషేధం పడింది. ఢాకా ప్రీమియర్‌ లీగ్‌ (డీపీఎల్) 2025లో అంపైర్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా స్పందించినందుకు తౌహిద్‌పై నాలుగు మ్యాచ్‌ల సస్పెన్షన్ పడింది. అంతేకాదు అతడి ఖాతాలో 8 డీమెరిట్‌ పాయింట్లను చేర్చారు. డీపీఎల్ 2025లో అబాహానీ లిమిటెడ్‌తో జరిగే కీలక మ్యాచ్‌తో పాటు వచ్చే సీజన్‌లో జరిగే తొలి మూడు మ్యాచ్‌లకు తౌహిద్‌ ​దూరం కానున్నాడు. డీపీఎల్ 2025లో మొహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

Also Read: Kishan Reddy: దక్షిణాదిలో కూడా బీజేపీ జెండా ఎగరేస్తాం!

తౌహిద్‌ హృదోయ్‌ తాజాగా గాజీ గ్రూప్ క్రికెటర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో 54 బంతుల్లో 37 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఔటైన తర్వాత అంపైర్ నిర్ణయంపై తౌహిద్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానం వైపు చూపిస్తూ.. తలను అడ్డంగా ఊపాడు. ఇది డీపీఎల్ ప్రవర్తనా నియమావళి లెవల్ 1 నేరంగా పరిగణించారు. Tk 10,000 (7,026 రూపాయలు) జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. అంతకుముందు అతడి ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్స్ ఉండడంతో.. నాలుగు మ్యాచ్‌ల నిషేధం పడింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో తౌహిద్‌ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version