ఓ వ్యక్తి కేవలం 90 నిమిషాల్లో 22 పెగ్ ల మధ్యం సేవించారు. అంతే కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన పోలాండ్ లో చోటు చేసుకుంది. ఒక బ్రిటీష్ టూరిస్ట్ తన స్నేహితుడితో కలిసి పోలాండ్ లోని ఓ నైట్ క్లబ్ కి వెళ్లాడు. ఉచిత ప్రవేశం ఉన్నందున కాసేపు గడుపుదామని వెళ్లాడు. ఆ తర్వాత అతడు అక్కడ ఏకంగా 22 పెగ్ లు సేవించాడు. అది కూడా జస్ట్ 90 నిమిషాల్లోనే లాగించేశాడు. దీంతో ఆ టూరిస్ట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోయాడు. పర్యాటకుడి రక్తంలో అల్కహల్ కంటెంట్ ఏకంగా 0.4 శాతంగా ఉందని ఇది ప్రాణంతకంగా మారుతుందని వైద్యులు వెల్లడించారు.
Also Read : Happiest State : ఇండియాలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో మీకు తెలుసా..?
అధికంగా మద్యం తాగడం వల్లే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. అతను అపస్మారక స్థితిలో ఉండగా అతని వద్ద నుంచి దాదాపు రూ. 37 వేల నగదును సైతం దొంగలించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ఆ వ్యక్తికి తక్షణ సాయం అందించలేదని చెప్పారు. ఆ క్లబ్ సిబ్బంది ఒత్తిడి మేరకు అతడు అంత మోతాదులో మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలాంట్ పోలీసులు.. కొన్ని నైట్ క్లబ్ లు కస్టమర్ లను తాగించే ఒక రాకెట్ ని నడుపుతున్నట్లు పేర్కొన్నారు. బాధితుడిని మత్తులో పడేపోయేంత వరకు బాగా తాగించి, స్పృహ కోల్పోచేలా చేసి దోచుకుంటారని చెప్పారు. ఆ తర్వాత బాధితుడు మోతాదుకి మించి తాగడంతో చనిపోవడం జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు అలాంటి నైట్ క్లబ్ లపై వరుస దాడులు నిర్వహించి సుమారు 58 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అలాగే ఆ బ్రిటిష్ పర్యాటకుడిపై హత్యకు పాల్పడిన నైట్ క్లబ్ టీమ్ ని కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read : UP Govt: రోడ్లపై మతపరమైన కార్యక్రమాలకు నో.. ఈద్‌కు ముందు యోగి ప్రభుత్వం ఆంక్షలు