ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. గత మూడు రోజులుగా ముంబైలో కురుస్తున్న వర్షాలకు పిచ్, అవుట్ ఫీల్డ్ తడిగా మారాయి. ఈ క్రమంలో అంపైర్లు మైదానాన్ని పరిశీలించారు. ఆటకు అనువుగా లేకపోవడంతో టాస్‌ను కాసేపు వాయిదా వేశారు. గ్రౌండ్ సిబ్బంది, అంపైర్లు ఉ.9:30గంటలకు మరోసారి మైదానాన్ని పరిశీలించనున్నారు. ఆ తర్వాతే టాస్ వేసి మ్యాచ్‌ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రెండో టెస్ట్ సుమారు 30 నిమిషాల పాటు ఆలస్యంగా ప్రారంభం కానుంది.
ఆలస్యంగా ప్రారంభం కానున్న రెండో టెస్ట్
