NTV Telugu Site icon

Tornado: కాలిఫోర్నియాలో సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్

Tornado

Tornado

Tornado: అమెరికాలోని కాలిఫోర్నియాలో బుధవారం శక్తివంతమైన సుడిగాలి అతలాకుతలం చేసింది. లాస్‌ ఏంజిల్స్ సమీపంలోని మోంటెబెల్లో నగరాన్ని కదిలింది. మాంటెబెల్లో నగరంలో సుడిగాలి వల్ల ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. భవనాల పైకప్పులు కూలిపోయాయి. బీభత్సం సృష్టించిన ఈ సుడిగాలి ఒక్క నిమిషంలోనే విద్యుత్తు అంతరాయానికి కారణమైంది. ఈ సుడిగాలి తాకిడికి చెట్లన్ని నేలకూలాయి. ఇళ్లు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాలిఫోర్నియాను చీల్చిచెండాడిన తీవ్రమైన తుఫానును మరువక ముందే ఈ సుడిగాలి మరోసారి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Read Also: Dmitry Medvedev: పుతిన్‌ను విదేశాల్లో అరెస్టు చేయడం అంటే యుద్ధాన్ని ప్రకటించినట్లే..

“సుడిగాలి భవనం పైకప్పును కూల్చివేసి, కారు అద్దాలన్నింటినీ పగులగొట్టింది. కార్లు ధ్వంసమయ్యాయి. ఇది ఒక విపత్తు.” అని స్థానికి వ్యాపారి వెల్లడించారు. పారిశ్రామిక భవనాలపై పైకప్పు ఎగురుతున్నట్లు చిత్రాలు చూపించాయి. నేషనల్ వెదర్ సర్వీస్ (NWS) వాతావరణ సంఘటనను పరిశోధిస్తున్నట్లు పేర్కొంది. దీనిని “బలహీనమైన సుడిగాలి”గా అభివర్ణించింది. దానికి అదనంగా ఉత్తరాన ఉన్న కార్పింటెరియాలో సుమారు 25 మొబైల్ గృహాలు దెబ్బతిన్నాయి. సుడిగాలులు గంటకు 300 మైళ్ల వేగంతో దూసుకెళ్లగలవు. పరిసర ప్రాంతాలను సెకన్లలో నాశనం చేయగలవు. ఈ సుడిగాలి వల్ల గంటకు 85 మైళ్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ సేవ అంచనా వేసింది. “కాలిఫోర్నియా ప్రమాణాల ప్రకారం ఇది అతిపెద్ద సుడిగాలి, ఇది జనావాస ప్రాంతాలను తాకింది. స్పష్టంగా పెద్ద నష్టాన్ని కలిగించింది” అని వాతావరణ శాస్త్రవేత్త డేనియల్ స్వైన్ ట్విట్టర్‌లో తెలిపారు.