NTV Telugu Site icon

Business Ideas: రూ.50వేలతో గ్రామాల్లో చేయగల బెస్ట్ వ్యాపారాలు ఇవే.. మీరూ ట్రై చేయండి!

Bussiness

Bussiness

Business Ideas: బిజినెస్ చేయాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ రిస్క్ ఉంటుందని తెలిసి ధైర్యం చేసే వారు తక్కువ మంది ఉంటారు. వ్యాపారం ప్రారంభించాలంటే ముఖ్యంగా కావాల్సింది పెట్టుబడి. వ్యాపారం చేసేందుకు చేతిలో సరిపడా డబ్బు లేకపోతే లోన్స్, అప్పులు చేయాల్సి ఉంటుంది. అదృష్టం బాగుండి లాభాలు వస్తే సరి లేదంటే ఆర్థికంగా చితికి పోవడం ఖాయం. కాబట్టి తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చే వ్యాపారాలు చేయడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. మీరు ఊర్లలో ఉండి వ్యాపారం చేయాలని ఆలోచిస్తే.. మంచి లాభాలను అందించే బిజినెస్ లు ఉన్నాయి. కేవలం రూ. 50 వేల ఇన్వెస్ట్ మెంట్ తో ప్రారంభించి ప్రతి రోజు మంచి ఆదాయాన్ని పొందొచ్చు. మరి మీరు సంపద సృష్టించాలనుకుంటున్నారా? నలుగురికి ఉపాధి కల్పించాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఈ వ్యాపారాలతో మీ కలలను నిజం చేసుకోండి.

Read Also: BCCI Review Meeting: బీసీసీఐ సమీక్ష సమావేశం.. తేలనున్న సీనియర్ ఆటగాళ్ల, కోచ్ గౌతమ్ గంభీర్ భవితవ్యం?

ఫోన్ రిపేర్ షాప్:

ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరు మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. ప్రతి ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ ఫోన్లు ఉంటున్నాయి. ఫోన్ యూజ్ చేయడం వరకు ఓకే గాని రిపేర్ వస్తే మాత్రం షాప్ కు వెళ్లాల్సిందే కదా. కాబట్టి మీరు మీ విలేజ్ లోనే మొబైల్ రిపేర్ షాప్ ప్రారంభించినట్లైతే మీ వ్యాపారానికి తిరుగుండదు. ప్రతి రోజు ఆదాయం వస్తుంది. తక్కువ స్థలంలో తక్కువ పెట్టుబడితో మొబైల్, టాబ్లెట్స్, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ లు రిపేర్ చేసే చిన్న షాప్ ఓపెన్ చేయవచ్చు.

టైలరింగ్ షాప్:

టైలరింగ్ కూడా మంచి ఆదాయానికి బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. రెడీమేడ్ దుస్తులు అందుబాటులోకి వచ్చాక కూడా టైలరింగ్ కు ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు. ఆన్ లైన్ ద్వారా, లేదా షాపుల్లో దుస్తులు తీసుకుంటారు. అయితే కొలతలు సెట్ అవ్వక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారి కోసం స్టిచ్చింగ్, ఆల్టరేషన్ సేవలు అందించేందుకు టైలరింగ్ షాప్ స్టార్ట్ చేసుకోవచ్చు. తక్కువ పెట్టుబడితోనే మంచి లాభాలను అందుకోవచ్చు.

Read Also: Redmi 14C: బెస్ట్‌ ఆప్షన్స్‭తో పది వేల కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చేసిన రెడీమి మొబైల్

టీ స్టాల్:

తక్కువ పెట్టుబడితో కాసులు కురిపిస్తున్న వ్యాపారం ఏదైనా ఉందా అంటే అది టీ వ్యాపారం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా టీ కొట్టు బిజినెస్ లాభదాయకంగా మారింది. రోజుకు రెండు, మూడు సార్లు కూడా టీ తాగేవాళ్లు ఉంటారంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి ఉన్న ఊర్లోనే టీ స్టాల్ ఏర్పాటు చేసుకుని బాగా సంపాదించుకోవచ్చు.

Show comments